ఏ తల్లిదండ్రులైనా పిల్లలు బాగా చదువుకుని ఉన్నత దశకు ఎదగాలని కోరుకుంటారు. అంతే తప్ప చెడిపోవాలని కోరుకోరు. ఇక ప్రభుత్వాలు కూడా చదువులను ప్రోత్సహించి.. ఉద్యోగాలు కల్పించాలి. విద్యార్థి దశలోనే తమ కాళ్ల మీద నిలబడేలా చేయాలి. ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితులే చూశాం. కానీ చైనా ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై కాలేజీల్లో విద్యార్థులకు ప్రేమ పాఠాలు నేర్పించాలంటూ వినూత్న ఆదేశాలు ఇచ్చింది.
చైనాలో సంతానోత్పత్తి రోజురోజుకు తగ్గిపోతుంది. దేశ జనాభా భారీగా తగ్గిపోతుందని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. ఒకప్పుడు భారత్ కంటే జనాభాలో చైనా అధిక స్థానంలో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి దిగజారిపోయింది. 2023లో వరుసగా రెండోసారి చైనా జనాభా నిష్పత్తి ఘననీయంగా క్షీణించిపోయింది. ఈ నేపథ్యంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. సంతానోత్పత్తి పెంచేందుకు అన్ని కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో వివాహం, కుటుంబం, సంతానోత్పత్తికి సంబంధించిన పాఠాలను విద్యార్థులకు నేర్పించాలని చైనా ఆదేశాలు ఇచ్చింది. జనాభా రేటును పెంచేందుకు యువకులకు ప్రేమ విద్యను అందించాలని సూచించింది.
ఇది కూడా చదవండి: Kaushik Reddy: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హల్చల్..
విద్యాపరమైన ఒత్తిడి కారణంగా 57 శాతం మంది విద్యార్థులు వివాహ సంబంధాలపై ఆసక్తి చూపడం లేదని ఓ సర్వేలో తేలింది. చాలా మంది పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడడం లేదని నివేదికలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో వివాహ సంబంధాలపై అవగాహన, భవిష్యత్‌లో సంతానోత్పత్తిని ప్రోత్సహించడానికి కాళాశాలల్లోనే పునాది వేయాలని యూనివర్సిటీలకు చైనా సూచించింది. చదువులతో పాటు శృంగారం గురించి అవగాహన కల్పించాలని పేర్కొంది. ప్రేమ, వివాహం గురించి శాస్త్రీయంగా అవగాహన లేకపోవడంతో యువత వివాహానికి దూరమైపోతున్నారని స్పష్టం చేసింది. జనాభా పెరుగుదలకు విద్యార్థి దిశలోనే ప్రేమ పాఠాలు నేర్పించి.. వివాహాలు చేసేకునేందుకు విద్యార్థులను ప్రోత్సహించాలని చైనా ప్రభుత్వం ఆయా విద్యా సంస్థలకు సూచించిది.
ఇది కూడా చదవండి: Eknath Shinde: డిప్యూటీ సీఎంపై తేల్చని షిండే.. అజిత్ పవార్‌పై చురకలు..