Bunker Buster Bomb: అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కి “బంకర్ బస్టర్ బాంబులు”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bunker Buster Bomb: ఇజ్రాయిల్, హమాస్ మధ్య మరోసారి యుద్ధం ప్రారంభమైంది. ఇటీవల వారం రోజుల పాటు ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం, సంధి కుదిరింది. హమాస్ తన చెరలో ఉన్న ఇజ్రాయిల్ బందీలను వదిలేయగా.. అందుకు ప్రతిగా ఇజ్రాయిల్ తమ జైళ్లలో పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అయితే తాజాగా సంధి ముగియడంతో మరోసారి యుద్ధం ప్రారంభమైంది. అయితే సంధి కాలంలో గాజాస్ట్రిప్ నుంచి ఇజ్రాయిల్ పైకి దాడి జరిగింది, దీని వల్లే మళ్లీ యుద్ధం ప్రారంభమైందని అమెరికా ఆరోపిస్తోంది.
Read Also: Ayodhya Ram Temple: అయోధ్య రామమందిర శంకుస్థాపన.. 6000 మంది అతిథులకు ఆహ్వానం
Also Read
- Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
- Trump: ఈ రాత్రి ఇరాన్‌ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
- Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
- Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు...
ఇదిలా ఉంటే గాజాలోని సొరంగాలు హమాస్ తీవ్రవాదులకు రక్షణగా నిలుస్తున్నాయి. వీటిని చేధించడం ఇజ్రాయిల్ సైనికులకు కష్టంగా మారింది. ప్రస్తుతం బందీలు కూడా ఈ సొరంగాల్లోనే ఉన్నట్లు ఇజ్రాయిల్ విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా తన అత్యాధునిక ‘బంకర్ బస్టర్ బాంబుల’ను ఇజ్రాయిల్‌కి అందించింది. అమెరికా సరఫరా చేసిన ఆయుధాల్లో దాదాపుగా 15,000 బాంబులు, 57,000 ఫిరంగి షెల్స్ ఉన్నాయి. వీటిలో 100 బీఎల్‌యూ -109 బంకర్ బస్టర్ బాంబులు ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి 2000 పౌండ్ల బరువు ఉంటుంది. ఇది ఇజ్రాయిల్ సైన్యానికి కీలకంగా మారింది.
గాజా నగరంలో ఆస్పత్రుల కింద నుంచి హమాస్ టన్నెల్ నెట్వర్క్ విస్తరించి ఉంది. ఈ బాంబులకు కాంక్రీట్ గోడల లోతుకు చొచ్చుకెళ్లే సామర్థ్యం ఉంది. హమాస్ ఉపయోగించే క్లిష్టమైన టన్నెల్ నెట్వర్క్ని లక్ష్యంగా చేసుకోవడానికి ఈ బాంబులు ఉపయోగపడనున్నాయి. గాజాలోని జనసాంద్రత కలిగిన జబాలియా శరణార్థి శిబిరంపై దాడి, ఈ ఆయుధాల పనే. ఈ దాడిలో 100 మందికి పైగా మరణించారు. అక్కడ ఉన్న భవనం ధ్వంసమైంది. ఈ ఆపరేషన్‌లో కీలక హమాస్ నేతను హతమార్చినట్లు ఇజ్రాయిల్ తెలిపింది. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, సోమాలియా, లిబియా దేశాల్లో జరిగిన యుద్ధాల్లో యూఎస్ సైన్యం బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించి బంకర్లను ధ్వంసం చేసింది.
తాజావార్తలు
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
-
New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
-
Chicken Biryani Recipe: చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్ ఫార్ములా.. నలుగురికి ఎంత బియ్యం, ఎంత చికెన్ వాడాలో తెలుసా..?
-
Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!