Trump vs Putin: రష్యా- ఉక్రెయిన్ మధ్యం యుద్ధం త్వరలో ముగిసే అవకాశాలు కనిపించడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ మధ్య భేటీ జరగడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ అన్నారు.. నూనె, వెనిగర్‌లను కలపడం ఎంత కష్టమో, ఈ సమావేశాన్ని జరిపించడం కూడా అంతే కష్టమని పేర్కొన్నారు. అయితే, యుద్ధం ముగింపునకు సంబంధించి పుతిన్, జెలెన్‌స్కీలు సహకరించాలా లేదా అనే విషయమై నాకింకా క్లారిటీ రాలేదని వెల్లడించారు. అంతేకాదు, భవిష్యత్తులో జరిగే మీటింగ్ కు తాను హాజరవుతానో లేదో కూడా ఇంకా చెప్పలేకపోతున్నాను అని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు.
Read Also: Pawan Kalyan : OG ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్.. ఎన్ని మిలియన్స్ రాబడతాడో?
అయితే, ఉక్రెయిన్‌లోని అమెరికా ఫ్యాక్టరీలపై రష్యా వరుసగా దాడులు జరపడంపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు దిగితే మాస్కో భారీ ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య నేను శాంతి కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నాు.. కానీ, పుతిన్ తీసుకుంటున్న నిర్ణయాలు నన్ను సంతోషంగా ఉండనివ్వడం లేదన్నారు. యుద్ధంపై పుతిన్, జెలెన్‌స్కీల వైఖరి అర్థం చేసుకోవడానికి సుమారు రెండు వారాల టైం పడుతుందన్నారు. అప్పటి దాకా వారు ఓ ఒప్పందానికి రాకపోతే తానే నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. ఆ నిర్ణయంతో భారీ ఆంక్షలా, సుంకాలా లేదా రెండూ కావొచ్చని వెల్లడించారు. ఇక, శాంతియుత చర్చల కోసం తాను చేసే ప్రయత్నాలను ట్రంప్ తెలిపారు.