Bangladesh Violence: ‘‘అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు’’.. షేక్ హసీనా ప్రత్యర్థి ఖలిదా జియా తొలి సందేశం..
- షేక్ హసీనా ప్రత్యర్థి ఖలిదా జియా తొలి సందేశం..
- విద్యార్థులు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు..
- అన్ని మతాలను గౌరవించే కొత్త బంగ్లాదేశ్ నిర్మిద్దాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Violence: బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనల మధ్య తొలిసారిగా షేక్ హసీనా ప్రత్యర్థి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) చీఫ్, మాజీ ప్రధాని ఖలిదా జియా తొలి సందేశాన్ని ఇచ్చారు. షేక్ హసీనా రాజీనామా చేసి దేశం నుంచి పారిపోయిన తర్వాత, ఆ దేశ అధ్యక్షుడు షహబుద్దీన్ జైలులో ఉన్న ఖలిదా జియాను విడుదల చేయాలని ఆదేశించారు. ఆమె విడుదలైన తర్వాత తొలిసారిగా మాట్లాడింది. అనారోగ్యంతో ఆస్పత్రి బెడ్‌పై ఉండే ఆమె తన సందేశాన్ని ఇచ్చారు.
Read Also: Priya Bhavani Shankar: ఇండియన్ 2 ట్రోల్స్ చాలా ఇబ్బంది పెడుతున్నాయి.. ప్రియా భవానీ శంకర్ ఎమోషనల్
Also Read
- Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
- F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
‘‘ అన్ని మతాలను గౌరవించే ప్రజాస్వామ్య బంగ్లాదేశ్’’ని నిర్మించాలని దేశ ప్రజల్ని ఆమె కోరారు. ‘‘మీరు ఇంతకాలం నా ఆరోగ్యం కోసం ప్రార్థించారు. అల్లా ఆశీర్వాదం కారణంగా నేను మీతో మాట్లాడగలిగాను. ఈ ఫాసిస్ట్ ప్రభుత్వం నుంచి మేము స్వాతంత్య్రం పొందాము. ప్రాణాలర్పించిన ధైర్యవంతులకు నా ప్రణామాలు’’ అంటూ వీడియో సందేశంలో పేర్కొన్నారు. మన ధైర్యవంతులైన పిల్లలు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు, దేశాన్ని విముక్తి చేశారని అన్నారు. ఈ విజయం తమని కొత్త ఆరంభంలోకి తీసుకువచ్చింది. దీర్ఘకాలిక ప్రజాస్వామ్య శిథిలాలు, అవినీతి నుంచి బయటపడిన కొత్త దేశాన్ని, సుసంపన్నమైన బంగ్లాదేశ్‌ని నిర్మించాలని ఆమె పిలుపునిచ్చారు. విద్యార్థులు యువతే తమ భవిష్యత్తు అని, వాళ్ల కలలకు ప్రాణం పోయాలని ఆమె సోషల్ మీడియాలో సందేశాన్ని పోస్ట్ చేశారు.
“అన్ని మతాలను గౌరవించే ప్రజాస్వామ్య బంగ్లాదేశ్‌ను మనం నిర్మించాలి. యువత మరియు విద్యార్థులు దీనిని సాధిస్తారు. శాంతి మరియు శ్రేయస్సు ఉన్న ప్రగతిశీల బంగ్లాదేశ్. ప్రతీకారం మరియు ద్వేషం లేని దేశం” అని ఆమె అన్నారు. షేక్ హసీనా పాలనలో 2018లో అక్రమాల కేసులో 79 ఏళ్ల ఖలీదా జియాకు 17 ఏళ్ల జైలు శిక్ష పడింది. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కుప్పకూలడంతో, ప్రెసిడెంట్ ఆదేశాలతో ఖలిదా జియా మంగళవార జైలు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం ఏర్పడబోయే తాత్కాలిక ప్రభుత్వంలో ఈమె పార్టీ బీఎన్పీ కూడా భాగస్వామ్యం కాబోతోంది.
తాజావార్తలు
-
Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్ఫుల్ లైఫ్ లెసన్!
-
Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
-
Peddi: ‘పెద్ది పార్ట్ 2’పై బుచ్చిబాబు ఫుల్ క్లారిటీ..!
-
Karuppu : 13 ఏళ్ల తర్వాత హిట్ కొట్టిన సూర్య.. సింగం – 2 వసూళ్లను బ్రేక్ చేసిన ‘వీరభద్రుడు’
-
Vaibhav Sooryavanshi: వామ్మో.. కోహ్లీ, అభిషేక్ రికార్డులు బద్దలుగొట్టిన బుడ్డోడు.. ఐపీఎల్లో నయా హిస్టరీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..