Pakistan: పోలింగ్‌కి ఒక రోజు ముందు పేలుళ్లతో దద్ధరిల్లిన పాక్.. 22 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు గురువారం జరగబోతున్నాయి. ఎన్నికలకు ఒక రోజు ముందు పాకిస్తాన్ ఉగ్రదాడులతో నెత్తురోడుతోంది. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఎన్నికల అభ్యర్థుల కార్యాలయాల సమీపంలో రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటన బుధవారం జరిగింది. ఈ జంట పేలుళ్లలో 22 మంది మృతి చెందారు. గురువారం ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన భద్రతపై ఆందోళన పెంచుతోంది.
Read Also: Eagle: చివరి 40 నిమిషాలు ఇప్పటి వరకు చూడనంత కొత్తగా.. ‘ఈగల్’ నిర్మాత కామెంట్స్
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
పిషిన్ జిల్లాలోని ఇండిపెండెంట్ అభ్యర్థి కార్యాలయం వద్ద మొదటి బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. ఆఫ్ఘన్ సరిహద్దు పట్టణమైన ఖిల్లా సైఫుల్లాలో రెండో పేలుడు సంభవించింది. జమియాత్ ఉలేమా ఇస్లాం కార్యాలయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ దాడుల వెనక ఎవరున్నారనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఇస్లామిక్ తాలిబాన్, బలూచిస్తాన్ వేర్పాటువాద గ్రూపులు ఇటీవల పాక్ వ్యాప్తంగా దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రాంతాల్లో పోలీసులు, పాక్ ఆర్మీ లక్ష్యంగా దాడులకు దిగుతున్నాయి.
మరోవైపు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉండటం, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మళ్లీ పాక్ ఎన్నికల్లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదంతో అల్లాడుతున్న పాకిస్తాన్‌కి ఈ ఎన్నికలు కీలకం కాబోతున్నాయి. అయితే, ఈ ఎన్నికల కోసం పాక్ ఆర్మీనే లండన్‌లో ఉన్న నవాజ్ షరీఫ్‌ని ఎన్నికల బరిలో దింపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..