Eagle Producer TG Vishwaprasad Comments on Climax: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఈగల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్న క్రమంలో హీరో సహా హీరోయిన్లు దర్శక నిర్మాతలు సినిమా గురించి చేస్తున్న ప్రమోషన్స్ చూస్తుంటే జనాల్లో మరింత ఆసక్తి పెరిగిపోతోంది. సంక్రాంతి బరి నుంచి వెనక్కి వెళ్లడం మొదలు ఈ సినిమా మీద ఇప్పటి వరకు మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఈగల్ సినిమాను వీక్షించిన రవితేజ రియాక్షన్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆదాల ఉండగా ఇప్పుడు తాజాగా నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈగల్ గురించి చెప్పిన మాటలు సినిమా మీదున్న హైప్‌ను మరింతగా పెంచేసే విధంగా ఉన్నాయి.
Mrunal Thakur: నెపోటిజమ్ విషయంలో స్టార్ కిడ్స్ తప్పేం లేదు.. మృణాల్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు
వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆయన ఇప్పుడు సినిమా క్లైమాక్స్ గురించి చెబుతున్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. నిన్ను కోరికి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్, ఆ టైంలో యూఎస్ షెడ్యూల్ అంతా తానే చూసుకున్నా కాబట్టి కార్తీక్‌తో పరిచయం ఏర్పడిందని టీజీ విశ్వ ప్రసాద్ చెప్పుకొచ్చాడు. ఇక ధమాకా టైంలో కెమెరామెన్‌గా ఉన్న కార్తీక్ ఈగల్ లైన్ చెప్పగా ఆ పాయింట్ రవితేజకి కూడా బాగా నచ్చి ఈగల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందన్నారు. వంద కోట్లు పెడితే ఎలాంటి క్వాలిటీతో సినిమా వస్తుందో.. అలాంటి క్వాలిటీని తక్కువ బడ్జెట్‌లోనే వచ్చేలా తీశామని పేర్కొన్న ఆయన చివరి 40 నిమిషాలు సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలిపారు. ఇంత వరకు తెలుగులో ఇలాంటి క్లైమాక్స్ వచ్చి ఉండదని విశ్వప్రసాద్ పేర్కొన్నారు. ఎక్కువ చేసి చెప్పడం లేదు అలా అని బాహుబలితో కంపేర్ చేయడం లేదు కానీ సినిమా లోకేష్ కనకరాజు స్టైల్లో ఉంటుందని చెప్పి సినిమా మీద మరింత అంచనాలు పెంచేశారు విశ్వప్రసాద్.