Pakistan: పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా మరోసారి బిలావల్ భుట్టో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్‌లోని ప్రధాని షెహబాజ్ షరీఫ్ మంత్రివర్గంలో బిలావల్ భుట్టో కీలక పదవి చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా పనిచేసిన బిలావల్ భుట్టో మరోసారి ఇదే పదవిని చేపట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో బిలావల్ భుట్టో నేతృత్వంలని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) అధికారం కోసం కూటమిగా ఏర్పడ్డాయి. బిలావల్ భుట్టోకి విదేశాంగ మంత్రి పదవి కల్పించేందుకు ప్రస్తుతం విదేశాంగ మంత్రిగా ఉన్న ఇషాక్ దార్‌ని ఉప ప్రధాని చేశారు.
Read Also: Chennai: చెన్నైలో దారుణం.. 5 ఏళ్ల చిన్నారిపై కుక్కల దాడి.. పరిస్థితి సీరియస్
Also Read
క్యాబినెట్‌లో చేరేందుకు ముందుగా విముఖత ప్రదర్శించిన బిలావల్ తర్వాత విదేశాంగ మంత్రి అయ్యేందుకు అంగీకరించారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. జూన్ మొదటి వారంలో బడ్జెట్ సమర్పించే లోపు పీపీపీ పార్టీని మంత్రివర్గంలో చేర్చుకోవాలని ప్రధాని షెహబాజ్ షరీఫ్ కోరినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఇప్పటి వరకు విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఇషాక్ దార్ ఈ పదవిపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తనకు ఇష్టమైన ఆర్థిక మంత్రిత్వ శాఖను చూసుకోవాలని అనుకుంటున్నట్లుగా సమాచారం. గత ప్రభుత్వంలో బిలావల్ భుట్టో 16 నెలల పాటు విదేశాంగ మంత్రిగా పనిచేశారు.
తాజావార్తలు
-
Temple Tourism: అమరావతికి సరికొత్త కాంతి.. తిరుమల తర్వాత ఆ స్థాయిలో అక్కడ శ్రీవారి క్షేత్రం..
-
Harish Rao : అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తాం
-
Dada : ‘దాదా’గా బాలయ్య బ్లాస్టింగ్ ఎంట్రీ: పోలీసులపైనే రివాల్వర్ గురిపెట్టి!
-
Punjab: ఆప్‌లోకి గ్యాంగ్‌స్టర్.. పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం..
-
Mokshagna: బరిలోకి సింబా.. బాలయ్య ఆశీస్సులతో మోక్షజ్ఞ మాస్ ఎంట్రీ!
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!