Bilawal Bhutto: ఇమ్రాన్ ఖాన్‌పై ఇంకెంత ప్రతీకారం తీర్చుకుంటారు?.. పాక్ రాజకీయాల్లో భుట్టో కలకలం!
- ఇమ్రాన్ ఖాన్‌పై ఇంకెంత ప్రతీకారం తీర్చుకుంటారు..
- సొంత ప్రభుత్వంపైనే బిలావల్ భుట్టో ప్రశ్నలు..
- పాకిస్తాన్ రాజకీయాల్లో కలకలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bilawal Bhutto: పాకిస్తాన్ రాజకీయాల్లో కలకలం రేగింది. మాజీ ప్రధాని, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ గురించి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) ఛైర్మన్ బిలవాల్ భుట్టో-జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సంచలనంగా మారింది. ఇమ్రాన్ ఖాన్‌ను ‘‘రాజకీయ ఖైదీ’’గా అభివర్ణించిన అతను… ఆయనను విడుదల చేయాలని, దేశంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. ఇమ్రాన్‌ను రాజకీయంగా విస్మరించడం ద్వారా పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థ ముందుకు సాగలేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న భుట్టో నుంచి ఈ వ్యాఖ్యలు రావడం సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలతో పీపీపీ, పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) మధ్య కొనసాగుతున్న విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. 2024 పాక్ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
Also Read
- Voyager 1: చరిత్ర సృష్టించిన వయోజర్-1 .. నేటితో ‘‘ఒక కాంతి రోజు’’ దూరంలోకి..
- ASEAN Summit: మోదీ ప్రయాణించిన ఆటో పాకిస్థాన్‌దా? వైరల్ ప్రచారంలో నిజమెంత.?
- Iran vs America: ఇరాన్ డర్టీ బాంబ్.. అమెరికాలో అలెర్ట్!
- Trump Assassination Plot: ట్రంప్ హత్యకు కుట్ర.. పాకిస్థానీ వ్యక్తికి అమెరికాలో 27 ఏళ్ల జైలు శిక్ష!
ఇంకెంత ప్రతీకారం తీర్చుకుంటారు.?
మంగళవారం కరాచీ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో బిలావల్ భుట్టో ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రధానిగా పనిచేసిన ప్రతీ ఒక్కరూ చివరకు జైలుకు వెళ్తున్నారని, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ ప్రధానమంత్రిగా నివాసంలో కూర్చుంటున్నారని అన్నారు. పాకిస్తాన్ చరిత్రలో ప్రధానిగా పనిచేసిన వారు అవినీతిపరులా.? లేక రాజకీయ కక్షకు బాధితులా? అని ప్రశ్నించారు. ఈ ప్రతీకార రాజకీయాలకు ముగింపు పలకాలని అననారు. మనం రాజకీయ ఖైదీలను ఎప్పటికైనా విడుదల చేయాలి, మీరు ఇంకెంత కాలం ప్రతీకారం తీర్చుకుంటారు? అని ప్రశ్నించారు.
2023 ఆగస్టు నుంచి జైలులోనే ఇమ్రాన్?.
అవినీతి కేసులో అరెస్టయిన ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలోని అడియాల జైలు ఉన్నారు. 2018 నుంచి 2022 వరకు పాకిస్థాన్ ప్రధానమంత్రిగా పనిచేసిన ఇమ్రాన్ తనపై వచ్చిన అవినీతి ఆరోపణల్ని ఖండిస్తున్నారు. 2023 ఆగస్టు నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. షహజాబ్ షరీఫ్ ప్రభుత్వం, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్లు కలిసి తమ నేతను జైలులో పెట్టారని ఇమ్రాన్ పార్టీ పీటీఐ ఆరోపిస్తోంది.
పాక్ అధికార కూటమిలో విభేదాలు..
పాకిస్తాన్ అధికార కూటమిలో విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2024 వివాదాస్పద ఎన్నికల్లో ఏ పార్టీకి అధికారం రాకపోవడంతో పీపీపీ, ముస్లిం లీగ్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బిలావల్ భుట్టో తండ్రి ఆసిఫ్ అలీ జర్దారీ పాక్ అధ్యక్షుడిగా, షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా డీల్ కుదిరింది.
ఇదిలా ఉంటే, ఇటీవల పాకిస్థాన్‌లో కొత్త ప్రావిన్సులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై ఈ రెండు పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్ హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ నవంబర్ 12న కొత్త ప్రావిన్సుల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని ప్రతిపాదించారు. అయితే, ఈ అంశంపై తమను, పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని సంప్రదించలేదని పీపీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పరిణామాల తర్వాతే బిలావల్ భుట్టో నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
తాజావార్తలు
-
Bilawal Bhutto: ఇమ్రాన్ ఖాన్‌పై ఇంకెంత ప్రతీకారం తీర్చుకుంటారు?.. పాక్ రాజకీయాల్లో భుట్టో కలకలం!
-
Dia Mirza : “అతనితో పనిచేయడం ఒక పీడకల”.. స్టార్ యాక్టర్’పై నటి సంచలనం.. బాలీవుడ్లో అసలేం జరుగుతోంది?
-
Kishan Reddy : పేద విద్యార్థుల భవితకు భరోసా.. 4,741 మంది టెన్త్ విద్యార్థులకు ఫీజు చెల్లించిన కిషన్ రెడ్డి
-
Sharad Kapoor: రెండేళ్లుగా స్నానం లేదు.. మంచం దిగలేదు.. దయనీయ దుస్థితిలో బాలీవుడ్ నటుడు
-
Akash Chopra: ధోనీని దుర్భాషలాడిన CSK స్టార్ ప్లేయర్.. ఆ సమయంలో జరిగింది ఇదే..
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..