'సీతారామం' సినిమాతో ప్రేక్షకుల మది దోచుకుంది మృణాల్‌ ఠాకూర్‌.

సినిమా చూసినప్పటి నుంచి కుర్రకారు సీత.. సీత.. అని కలవరిస్తున్నారనడం అతిశయోక్తి కాదు.

అంతలా తన నటనతో మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

సీతారామం చిత్రంలో  నిజానికి నటి పూజా హెగ్డే నటించాల్సింది.. కానీ.. మృణాల్‌ ఠాగూర్‌ లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది

ఆ చిత్రంలోని సీత పాత్రలో ఒదిగిపోయి సినీ ప్రేమికుల మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

సీతారామం చిత్రంలో చాలా సంప్రదాయ దుస్తుల్లో చక్కగా నటించి మెప్పించింది

ఈ బాలీవుడ్‌ భామ మొదట్లో మోడలింగ్‌ రంగంలోకి ప్రవేశించింది.

మృణాల్‌ ఠాగూర్‌కు బాలీవుడ్‌లో దక్కని సక్సెస్‌ దక్షిణాదిలో సీతారామంతో దక్కించుకుంది.

అయితే ఎక్కడ ఇంటర్వూలకు వెళ్లినా.. చాలా మంది 'మీ వయసెంత?' అని అడుగుతున్నారట?

వయసు 30 ఏళ్లు అని చెప్పగానే.. పెళ్లి ప్రస్తావన తెస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.