Beijing: బీజింగ్‌లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
- బీజింగ్‌లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం
- ప్రమాదంపై ఇంకా అధికారికంగా స్పందించని అధికారులు
- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజింగ్‌లో భారీ విమాన ప్రమాదం జరిగింది. అత్యంత ఎత్తైన భవనాన్ని విమానం ఢీకొట్టింది. దీంతో విమానం ముక్కలై కింద కార్లపై పడింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
చైనాలోని రాజధాని బీజింగ్‌లో శుక్రవారం సంచలన ఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక వివరాల ప్రకారం.. ఒక చిన్న విమానం తన నిర్దేశిత విమాన మార్గం నుంచి తప్పిపోయి బీజింగ్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని ఢీకొట్టింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోల ప్రకారం.. సన్వర్డ్ SA 60L ఆరోరా (Sunward SA 60L Aurora) లైట్ ఎయిర్‌క్రాఫ్ట్ (రిజిస్ట్రేషన్ B-12PP) ఈ ప్రమాదానికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది. వైరల్ వీడియోల్లో సుమారు 1,700 అడుగుల ఎత్తు ఉన్న చైనా జున్ భవనం నుంచి విమాన శకలాలు కింద పడిపోతుండగా.. భవనం అడుగు భాగం దగ్గర దట్టమైన పొగలు ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలాగే ఘటనాస్థలంలో విమాన శకలాలు చెల్లాచెదురుగా పడినట్లు కనిపించింది.
Also Read
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!

అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు లేదా గాయపడ్డారనే విషయంపై ఇప్పటివరకు అధికారిక సమాచారం వెలువడలేదు. మృతులు, గాయపడిన వారి సంఖ్యపై కూడా స్పష్టత లేదు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోల ప్రామాణికతను స్వతంత్రంగా ధృవీకరించలేదని సంబంధిత మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఘటనపై చైనా అధికారులు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
今天下午,一架型号为 B-12PP 的国产轻型通航小飞机,撞到了北京第一高楼 – 中国尊 pic.twitter.com/CobNs6fSBA
— Sea (@Sea_Bitcoin) June 26, 2026
- Tags
- aircraft
- Beijing
- china
- plane crash
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!