Justin Trudeau: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. రాజకీయాలకు ట్రూడో గుడ్ బై..
- కెనడా ప్రధానికి వరసగా ఎదురుదెబ్బలు..
- ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నాని ఇటీవల ప్రకటన..
- రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తాజాగా వెల్లడి..
- వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేసిన జస్టిన్ ట్రూడో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justin Trudeau: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సొంత దేశం, సొంత పార్టీతో పాటు ప్రపంచ దేశాల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారు. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్‌తో వైరం పెంచుకున్నాడు. ఖలిస్తానీవాదులకు మద్దతుగా నిలిచాడు. మరోవైపు ట్రంప్ గెలుపుతో అమెరికాతో కూడా వైరం పెంచుకున్నాడు. ఇక ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో ట్రూడో గెలవడని అన్ని పోల్స్ చెబుతున్నాయి. అతడి పాపులారిటీ పడిపోయింది, దీంతో సొంత పార్టీ నుంచి ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లు వచ్చాయి. చేసేదేం లేక తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
Read Also: Devendra Fadnavis: ముంబై సురక్షితమైన ప్రాంతం.. ఒక్క ఘటనతో విమర్శలు సరికాదు
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
ఇదిలా ఉంటే, తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే వరస దెబ్బలతో సతమతమవుతున్న ట్రూడో, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, రాజకీయాలను విడిచిపెట్టవచ్చని ప్రకటించారు. నేను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయను అని ట్రూడో బుధవారం గ్లోబల్ న్యూస్ ఆఫ్ కెనడాకు చెప్పారు. రాజకీయాలను విడిచిపెట్టిన తర్వాత తాను ఏం చేయలో ఆలోచించడానికి తనకు ఎక్కువ సమయం లేదని ట్రూడో అన్నారు.
ట్రూడో కెనడా మంత్రులతో పాటు అమెరికాలోని కెనడా రాయబారిని కలిశారు. ట్రంప్ కెనడా దిగుమతులపై సుంకాలు వేస్తానని బెదిరించడంపై కెనడా ఎలా స్పందిస్తుందనేదానిపై చర్చించడానికి సమావేశాలు జరిగాయి. ట్రూడో తన లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా నాయకుడి పదవికి కూడా రాజీనమా చేయనున్నారు. కొత్త నాయకుడిని ఎన్నుకున్న తర్వాత కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేస్తారు. ఆగస్టులో ఎన్నికలు జరిగే వరకు లిబరల్ పార్టీ నుంచి ఎంపీగా కొనసాగుతారు. 2025 అక్టోబర్‌లో జరగనున్న ఎన్నికల్లో పియరీ పొయిలివ్రే, అతని కన్జర్వేటివ్ పార్టీ ట్రూడో పార్టీ కన్నా ముందంజలో ఉందని పలు సర్వేలు చూపిస్తున్నాయి. వలసలు, ద్రవ్యోల్బణం, ఉపాధి, హౌసింగ్ సంక్షోభం వంటి కీలక విషయాల్లో ట్రూడో ప్రభుత్వం విఫలమైందని కెనడియన్లు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?