Makkah: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్‌కు ముప్పు పొంచి ఉందా?
- మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్!
- టర్కీ వ్యూహాత్మక ప్రణాళిక
- భారత్‌కు ముప్పు పొంచి ఉందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు ఇస్లామిక్ నాటోగా ఏర్పడ్డాయి. ఈ ఒప్పందం ప్రకారం ఒక దేశంపై దాడి చేస్తే.. మూడు దేశాలు శత్రువుపై దాడి చేయడమే ఈ ఒప్పందం ఉద్దేశం. ఇటీవల మక్కా వేదికగా ఈ మూడు దేశాలు సంతకాలు కూడా చేశాయి. తాజాగా ఒక సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. ఈ ఒప్పందంలోకి బంగ్లాదేశ్ కూడా చేరవచ్చని వార్తలు వస్తున్నాయి. టర్కీ మీడియాలో కథనం హల్చల్ చేస్తోంది. వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగానే బంగ్లాదేశ్ కూడా చేరవచ్చని కథనంలోని సారాంశం. భారత్‌ను ఎదుర్కొనేందుకు టర్కీ కుట్ర చేస్తున్నట్లుగా ఈ కథనంతో అర్థమవుతోంది.
సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీలు మక్కా ఒప్పందంపై సంతకాలు చేసిన వెంటనే టర్కీ వార్తాపత్రిక ‘యెని షఫాక్’లో ఒక వ్యాసం ప్రచురితమైంది. కూటమిలో బంగ్లాదేశ్ చేరే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీనిపై చర్చ జరిగినట్లుగా వెల్లడించింది. వ్యాసంలో రచయిత పేరును పేర్కొనలేదు. ఈ చర్య భారతదేశానికి ఆగ్రహం తెప్పిస్తుందని తెలిపింది.
Also Read
- Khawaja Asif: 'మధ్యవర్తి' నుంచి 'గారడీవాడి' స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
- Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
- Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
వాస్తవానికి ఇది మీడియా కథనమే అయినప్పటికీ ‘యెని షఫాక్’ అనేది సాధారణ వార్తాపత్రిక కాదు. టర్కీ ప్రభుత్వానికి చాలా సన్నిహితంగా ఉండే తీవ్రవాద పత్రిక. భారతదేశంపై టర్కీ అతిగా దృష్టి పెట్టడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. భారతదేశంలో చిన్న చిన్న సమస్యలను ఎత్తి చూపుతూ.. భారత్‌ను అపహాస్యం చేసేందుకు టర్కీ పూనుకున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో వార్తా పత్రిక భారత నాయకులను కూడా లక్ష్యంగా చేసుకోవడానికి కూడా వెనుకాడదని తెలుస్తోంది. 2024 నుంచి ఈ వార్తాపత్రిక బంగ్లాదేశ్‌లోని తిరుగుబాటుదారులకు బహిరంగ మద్దతి ఇస్తూ వస్తోంది. షేక్ హసీనాను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది భారత్ వ్యతిరేక వైఖరిలో భాగంగానే ఇదంతా జరిగింది. దీంతో యెనీ షఫాక్ కథనాన్ని పూర్తిగా నిరాధారమైనదిగా కొట్టిపారేయలేం.
ఎలాగైనా ఇస్లామిక్ నాటో కూటమిలోకి బంగ్లాదేశ్‌ను చేర్చుకోవాలని టర్కీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా కథనంలో తెలిపింది. పాకిస్థాన్‌తో ఉన్న సంబంధాలనే బంగ్లాదేశ్‌తో కొనసాగించాలని టర్కీ భావిస్తున్నట్లుగా సమాచారం.
తాజా పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. సౌదీతో భారత్‌కు మంచి ఒప్పందం ఉంది. దీంతో సౌదీతో ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు. కానీ ఈ ఒప్పందం ద్వారా టర్కీ అత్యధిక ప్రయోజనం పొందాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్‌కు టర్కీ బహిరంగంగా మద్దతు తెల్పడమే కాకుండా ఆయుధాలు కూడా సరఫరా చేసింది. ఈ నేపథ్యంలో భారతదేశం పూర్తి అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!