Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
- దీపు చంద్ర దాస్ హత్యలో ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
- బంగ్లాదేశ్‌లో సంచలనంగా మారిన హిందూ కార్మికుడి హత్య..
- ఏడాది కాలంగా గుర్తింపు మార్చుకుని మదర్సాల్లో నివాసం.
- . ఢాకాలో పట్టుపడిన యాసిన్ అరాఫత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dipu Chandra Das: గతేడాది డిసెంబర్లో బంగ్లాదేశ్ మతోన్మాదుల దాష్టీకానికి హిందూ వస్త్ర వ్యాపారి దీపు చంద్ర దాస్ ప్రాణాలు కోల్పోయాడు. దైవ దూషణ చేశాడనే నకిలీ అభియోగాల కారణంగా మతోన్మాదులు గుంపు దీపును దారుణంగా కొట్టి, నగ్నంగా చెట్టుకు వేలాడదీసి, కాల్చి చంపారు. బంగ్లాదేశ్ మైమెన్ సింగ్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనకు ప్రధాన సూత్రధారిగా ఉన్న మసీదు ఇమామ్ యాసిన్ అరావఫ్ (25)ని బంగ్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన తర్వాత ఏడాదిగా ఇతను పరారీలో ఉన్నాడు.
డిసెంబర్ 18న మైమెన్సింగ్ జిల్లా భలుకా ప్రాంతంలో పయనీర్ నిట్ కాంపోజిట్ ఫ్యాక్టరీలో పనిచేస్తు్న దీపు చంద్ర దాస్ దైవ దూషణ చేశాడనే ఆరోపణలు సృష్టించిన అరాఫత్, కంపెనీ గేటు ముందు ప్రజల్ని సమీకరించాడు. దీపుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తే, అతడిని దారుణంగా కొట్టి చంపేశారు. ఈ గుంపుకు అరాఫత్ నేతృత్వం వహించినట్లు జిల్లా ఏఎస్పీ అబ్దుల్లా అల్ మామున్ వెల్లడించారు. పోలీసులకు చిక్కుండా అరాఫత్ ఏడాది కాలంగా తన గుర్తింపును దాచుకుని ఢాకాలోని డెమ్రా ప్రాంతంలోని వివిధ మదర్సాల్లో తలదాచుకున్నట్లు తేలింది. చివరకు కీలక సమాచారం అందడంతో డెమ్రాలోని సుఫాపఫా మదర్సాపై దాడి చేసి ఇతడిని అరెస్ట్ చేశారు.
Also Read
- Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
- Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
- Europe Heatwave: యూరప్‌ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
- Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
ఈ మొత్తం వ్యవహారంలో దీపు ఎలాంటి దైవ దూషణ చేయలేదని విచారణలో తేలింది. దీపు మతపరమైన మనోభావాలను దెబ్బతీసినట్లు దర్యాప్తు అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీనికి తోడు, దీపు చాలా సామాన్యుడని, అతను ఆండ్రాయిడ్ ఫోన్ కూడా వాడలేదని, ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనూ ఖాతా కలిగి లేడని అతని కుటుంబ సభ్యులు కన్నీళ్లతో వెల్లడించారు. అంటే, ఇమామ్ ఒక గుంపును సమీకరించి అతన్ని సజీవంగా దహనం చేయడానికి దారితీసిన సోషల్ మీడియా పోస్ట్ లేదా పుకారుతో దీపుకు ఎలాంటి సంబంధం లేదు. ఈ కేసులో ఇప్పటి వరకు 21 మందిని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
-
Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
-
CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
-
Naga Bandham: 110 కోట్ల రిస్క్.. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లోనే అసలు రహస్యం!
-
Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!