Iran: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు మోజ్తబా ఎన్నిక.. సవాళ్లను ఎదుర్కోగలరా?
- ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు మోజ్తబా ఎన్నిక
- 80 మందితో కూడిన పండితుల కమిటీ ఎన్నిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మోజ్తబా అలీ ఖమేనీ (56) ఎన్నికయ్యారు. 80 మందితో కూడిన పండితుల కమిటీ మోజ్తబా పేరును ఆమోదించినట్లుగా ఇరాన్ మీడియా పేర్కొంది. చాలా కాలంగా తండ్రి ఖమేనీ వెనుక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఖమేనీ వారసుడిగా మోజ్తబానే అవుతారని ఎప్పటి నుంచో ప్రచారం కూడా ఉంది. మొత్తానికి అదే చివరికి నిజమైంది.
విచ్ఛన్నమైన దేశాన్ని ఏకం చేయడంలో.. నాయకత్వాన్ని ఏకతాటిపైకి తీసుకురాగల సత్తా మోజ్తబాకే ఉంటుందని కమిటీ విశ్వసించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో తీవ్రమైన ద్రవ్యోల్బణం, ఇంకోవైపు నిరుద్యోగం, మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం.. ఈ పరిణామాలను ఎలా డీల్ చేయగలరన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మెజ్తబా యుద్ధానికి ముగింపు పలుకుతారా? లేదంటే తండ్రి ఖమేనీలాగానే ముందుకు తీసుకెళ్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
Also Read
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar-Zelenskyy: కీవ్‌లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
- Tata Chemicals: టాటా కెమికల్స్‌కు కెన్యా షాక్.. వెళ్లిపోవాలని అధ్యక్షుడి ఆదేశం..
మోజ్తబా..
మోజ్తబా ఖమేనీ 1969లో ఇరాన్‌లోని మష్హాద్‌లో జన్మించారు. మతపరమైన విద్యను అభ్యషించారు. అలాగే హుజ్జతుల్-ఇస్లాం బిరుదును పొందారు. మోజ్తబా ఇరాన్-ఇరాక్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు మోజ్తబా ఖమేనీ ఎటువంటి ప్రభుత్వ పదవిని చేపట్టలేదు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఎన్నికయ్యారు.
మోజ్తబా తండ్రికి నీడలా ఉండే వ్యక్తిగా పనిచేశాడు. ఇరాన్‌లో అధికార పీఠమైన తన తండ్రి కార్యాలయం, బీట్-ఎ రహ్బరి పనితీరులో కీలక పాత్ర పోషించారు. ఇరాన్ సాయుధ దళాలు, రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, మిలీషియా, బాసిజ్‌పై కూడా పరోక్ష నియంత్రణ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Iran-Israel: ఇరాన్ ఎయిర్‌పోర్ట్‌పై ఇజ్రాయెల్ దాడి.. పార్క్ చేసిన అతి పెద్ద విమానం ధ్వంసం
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!