Social Media Ban: ఈ వయస్సులోపు పిల్లలకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ నిషేదం
- 16 ఏళ్లలోపు పిల్లలను సోషల్మీడియాకు దూరంగా ఉంచేలా ఆస్ట్రేలియా ప్లాన్..
- తమ సైట్లను 16 ఏళ్లలోపు పిల్లలు యాక్సెస్ చేయకుండా సోషల్ మీడియా చర్యలు తీసుకోవాలి..
- రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం: ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలను సోషల్మీడియాకు దూరంగా ఉండేలా ఆస్ట్రేలియా ప్లాన్ చేస్తుంది. ఆన్లైన్ నుంచి పిల్లలను రక్షించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని ఆంథోనీ అల్బనీస్ చెప్పారు. ఈ ఏడాది చివరిలో ప్రవేశ పెట్టనున్న ఈ కొత్త చట్టం పిల్లలు, టీనేజర్లకు సోషల్మీడియా ప్లాట్ఫామ్స్ చేస్తున్న నష్టానికి ప్రత్యక్ష ప్రతిస్పందనగా తాము భావిస్తున్నామని తెలిపారు. 16 ఏళ్లలోపు పిల్లలు తమ సైట్లను యాక్సెస్ చేయకుండా నిరోధించడానికి సోషల్మీడియా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రుల అంగీకారం ఉన్నా.. పిల్లలకు ఎలాంటి మినహాయింపులు ఉండవని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ పేర్కొన్నారు.
Read Also: Anil Ravipudi : పంథా మార్చుకోకపోతే త్వరలోనే కెరీర్ క్లోజ్.. డేంజర్ జోన్లో మరో డైరెక్టర్
Also Read
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
కాగా, యాక్సెస్ను నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నామని నిరూపించుకోవాల్సిన బాధ్యత సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై ఉందని ప్రధాని అల్బనీస్ తెలిపారు. పిల్లలకు సురక్షితమైన ఆన్లైన్ వాతావరణాన్ని నిర్ధరించడానికి టెక్కంపెనీలను జవాబుదారీగా ఉండాలన్నారు. ఇక, ఆస్ట్రేలియా పార్లమెంట్లో ఆమోదం పొందిన 12 నెలల తర్వాత నిబంధనలు అమల్లోకి వస్తుందన్నారు. అయితే, ఈ చట్టం అమల్లోకి వచ్చే సమయానికి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న పిల్లలపై ఎలాంటి నిషేధం ఉండదని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ వెల్లడించారు.
Read Also: IPL Auction 2025: ఆర్‌సీబీ నిర్ణయంతో సంతోషంగా ఉన్నా.. మ్యాక్స్‌వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇక, ఈ చట్టం అమలును ఆస్ట్రేలియాకు చెందిన ఈ-సేఫ్టీ కమిషనర్ పర్యవేక్షిస్తారని ప్రధాని అల్బనీస్ చెప్పుకొచ్చారు. యువ యూజర్లకు ఎలాంటి జరిమానాలు ఉండవు.. సోషల్మీడియా ప్లాట్ఫామ్స్ మాత్రం నిబంధనలు పాటించకపోతే.. తర్వాత జరిగే తీవ్ర పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా యాప్స్ వాడకంపై యూరోపియన్ యూనియన్ సహా అనేక దేశాలు గతంలో చేసిన ప్రయత్నాలు చేశాయి. కానీ, చాలా మంది పిల్లలు వయస్సు- ధృవీకరణను తప్పుగా నమోదు చేసి సోషల్ మీడియా యాప్స్ను వాడుతున్నారని నిపుణలు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..