యూకే నుంచి వచ్చేవారిపై భారత్ ఆంక్షలు.. అసలు కారణం ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ చాలా దేశాలు అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేస్తూ వస్తున్నాయి.. అయితే, ఇటీవల ఆ నిబంధనలు సడలించిన యూకే.. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రం క్వారంటైన్ తప్పనిసరి చేసింది. యూకేలో అడుగుపెట్టాలంటే కొవిడ్-19 పరీక్షకు సంబంధించి నెగటివ్ రిపోర్టును తప్పనిసరి చేయడమే కాదు.. 10 రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని పేర్కొంది. భారత్ ఈ వ్యవహారంపై దీలుగా స్పందించింది. అలాంటి ఫార్ములానే యూకే పౌరులకు వర్తిస్తుందని పేర్కొంది.. అక్టోబర్ 4వ తేదీ నుంచి అంటే ఈ నెల 4 నుంచి.. యూకే నుంచి భారత్‌కు వచ్చే పౌరులపై ఆంక్షలు పెట్టింది.. భారత్‌కు రావాలంటే యూకే పౌరులకు ఆర్టీ-పీసీఆర్ టెస్టు నెగటివ్ రిపోర్టు తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది.. అంతేకాదు.. భారత్‌లో అడుగుపెట్టడంతో 10 రోజుల తప్పనిసరి క్వారంటైన్లో ఉండాలంటూ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీ-పీసీఆర్ టెస్టు నెగటివ్ రిపోర్టు తప్పనిసరి చేసిన భారత్.. ఇక్కడ అడుగుపెట్టిన తర్వాత మరోమారు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపింది.. అంతేకాదు ఇక్కడ అడుగుపెట్టిన 8 రోజుల తర్వాత మరోమారు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని.. భారత్‌లో అడుగుపెట్టిన తర్వాత ఇంట్లో కానీ, మరో ప్రాంతంలో గానీ పది రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.
Also Read
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
తాజావార్తలు
-
Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
-
OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..