ఆఫ్రికాలోని ఇథియోపియా దేశంలో సైనికులకు, టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ తీవ్రవాదులకు మధ్య భీకరపోరు జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఉత్తర టిగ్రే ప్రాంతంలోని టొగొగాలోని ఓ మార్కెట్‌పై వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 80 మందికిపైగా మృతి చేందారు. వందల సంఖ్యలో గాయాలయ్యాయి.
Read: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి అంశంపై మంత్రి వెలంపల్లి చర్యలు…
ఇందులో అనేక మంది పరిస్థితి సీరియస్‌గా ఉన్నది. అయితే, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు సైనికులు ఒప్పుకోలేదు. అటు అంబులెన్స్‌లు వచ్చేందుకు కూడా అనుమతులు ఇవ్వకపోవడంతో మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. చాలా కాలంగా ఇథియోపియాలో ఉగ్రవాదులకు, సైనికులకు మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.