ఆస్ట్రేలియాకు చెందిన 93ఏళ్ల డాక్టర్ మళ్లీ తండ్రి కాబోతున్నాడు. ప్రస్తుతం ఈ విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మెల్‌బోర్న్‌కు చెందిన డాక్టర్ జాన్ లెవిన్.. తన భార్య (37) ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ద్వారా తన వంశాన్ని పెంచే యోచనలో ఉన్నాడు.
Read Also: Throwing Stone:ట్రైన్ లో అవేం పనులమ్మా.. తప్పనిపించడంలేదా..
56 సంవత్సరాల గ్యాప్ ఉన్నప్పటికి IVF ద్వారా వారి సంతానాన్ని వృద్ధి చేయాలనుకుంటున్నారు. ఈ ప్రక్రియ “సవాలుతో కూడుకున్నది” కానీ చాలా ప్రతిఫలదాయకంగా ఉందని డాక్టర్ లెవిన్ వెల్లడించారు. “మేము అంతటా ఓపికగా ఉన్నాము మరియు మళ్ళీ దాని ద్వారా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము” అని ఆయన అన్నారు, త్వరలో మరొక బిడ్డను కనాలనే ఆశను వ్యక్తం చేశారు.
Read Also:Throwing Stone:ట్రైన్ లో అవేం పనులమ్మా.. తప్పనిపించడంలేదా..
మెల్ బోర్న్‌కు చెందిన 93ఏళ్ల డాక్టర్ జాన్ లెవిన్ నాలుగవ సారి తండ్రి అయ్యాడు. ఐవీఎఫ్ ద్వారా స్పెర్మ్ దానం చేసిన ఆయన 37ఏళ్ల భార్య డాక్టర్ యాంగ్ యింగ్ లూతో కలిసి కొడుకు గాబీకి 2024 ఫిబ్రవరిలో వెల్ కమ్ చెప్పాడు. ఈ కపుల్ మధ్య ఏజ్ గ్యాప్ దాదాపు 57ఏళ్లు కాగా ఈ వృద్ధుడికి గత వివాహం నుంచి 60ఏళ్లు పైబడిన ముగ్గురు పిల్లలు ఉండటం విశేషం. పది మంది మనవళ్లు, ఓ ముని మనవడు కూడా ఉన్నారు. కానీ లెనిన్ మాత్రం మళ్లీ తండ్రి కావాలని కోరుకున్నాడు. అంతేకాదు గాబీ 21ఏళ్ల పుట్టినరోజును కలిసి జరుపుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. 16ఏళ్ల వయసు నుంచే కొడుకును బిజినెస్‌మెన్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.