సాధారణంగా ధ్యానం ఎందుకు చేస్తాం. మానసిక ప్రశాంతత కోసం.. యాక్టివ్ గా ఉండేందుకు చేస్తుంటాం. కానీ ఓ జంట మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తోంది. ధ్యానం పేరు చెప్పుకుని వారు చేస్తున్న పని చూస్తుంటే.. చాలా అసహ్యంగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు తెగ మండిపడుతున్నారు.
Read Also:Throwing Stone:ట్రైన్ లో అవేం పనులమ్మా.. తప్పనిపించడంలేదా..
పూర్తి వివరాల్లోకి వెళితే.. ధ్యానం.. మనసుకు శాంతిని అందిస్తుంది. మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది. అత్యుత్తమ చైతన్య స్థితిని పొందడం నుంచి అత్యధిక ఏకాగ్రత, సృజనాత్మకతనూ పొందవచ్చు. మతాలకు అతీతంగా సాధన చేసి మెడిటేషన్ పాశ్చాత్య దేశాలు కూడా అనుసరిస్తున్నాయి. విశేషంగా సాధన చేస్తున్నాయి. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ధ్యానంగా చెప్పబడుతుండటంతో .. వీడియోపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
Read Also:IVF: ముసలోడే కానీ.. 93ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న తాత
ఓ జంట యోగా పేరుతో చేస్తున్న దరిద్రపు వీడియో వైరలవుతుంది. ఓ అమ్మాయి.. అబ్బాయి ఒడిలో కూర్చుని.. ఇద్దరూ ముఖంలో ముఖం పెట్టి.. ఒకేసారి శ్వాస తీసుకుని వదులుతూ ఉన్నారు. దానికి చుట్టు పక్కలా వారు ధ్యానం చేస్తున్నారంటూ ఎంకరేజ్ చేస్తూనే ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఇది ధ్యానమా.. శృంగారమా అంటూ మండిపడుతున్నారు. కొందరు ఇలాంటి యోగా ఎక్కడా చూడలేదు.. మాకు కూడా ఇలాంటి యోగా నేర్చుకోవాలని ఉందంటూ… కొందరు ట్రోల్ చేస్తున్నారు.
What kind of Meditations is this 🙂 ? pic.twitter.com/x0YQVatByz
— theboysthing (@theboysthing07) October 16, 2025