లెబనాన్‌లో తాజాగా వాకీటాకీలు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. 300 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఆయా ప్రాంతాలు రక్తంతో తడిచిపోయాయి.
లెబనాన్‌ను మరోసారి పేలుళ్లు తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. మంగళవారం పేజర్లు పేలి వేలాది మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. ఈ ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే బుధవారం కూడా మరోసారి పేలుళ్లు లెబనాన్‌ను వణికించాయి. తాజాగా వాకీటాకీలు, మొబైల్స్ పేలిపోయాయి. దీంతో వందలాది మంది గాయపడ్డారు.