Pakistan: పాక్‌లో దారుణం.. బార్బర్స్‌ని కిడ్నాప్ చేసి కాల్చి చంపిన టెర్రరిస్టులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాముకు పాలు పోసి పెంచిన విధంగా టెర్రరిస్టులను పాకిస్తాన్ పెంచిపోషించింది, ఇప్పుడు ఆ పాముకే బలైపోతోంది. ఆ దేశంలో ఇటీవల కాలంలో ఉగ్రవాదుల కార్యకలాపాలు, దాడులు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్, సింధ్ వంటి ప్రాంతాల్లో ఉగ్రదాడులు నిత్యకృత్యమయ్యాయి. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా ఆర్మీ, పోలీసులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు.
Read Also: Karnataka: రామమందిర ఆందోళనలో పాల్గొన్న వ్యక్తి అరెస్ట్.. హిందువులను వేధిస్తున్నారంటూ బీజేపీ ఫైర్..
Also Read
- Nepal Flash Floods: నేపాల్‌ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
- Trump: ట్రంప్ దేనికో భయపడుతున్నాడు? 50 మంది సైనిక అధికారులకు పాలిగ్రాఫ్ పరీక్షలు!
- Explainer: 600 మంది పిల్లలు ఏమయ్యారు? హిమాలయ లోయల్లో ప్రతిధ్వనిస్తున్న కుటుంబాల ఆర్తనాదాల కథ!
- New World Map: వరల్డ్ మ్యాప్ లో భారీ మార్పు.. దేశాల అసలు పరిమాణాలు చూపించే కొత్త మ్యాప్‌కు UN ఆమోదం
ఇదిలా ఉంటే తాజాగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో ఉగ్రవాదులు ఆరుగురు బార్బర్స్‌ని కిడ్నాప్ చేసి కాల్చి చంపారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలోని మీర్ అలీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని స్థానిక మీడియా మంగళవారం నివేదించింది. పాక్ పంజాబ్ ప్రావిన్స్‌కి చెందిన బాధితులు స్థానిక బజార్‌లో కటింగ్ షాప్స్ నడుపుతున్నారు. సోమవారం వీరిని కిడ్నాప్ చేసి చంపేశారు, మంగళవారం వీరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే, ఈ హత్యలకు ఎవరు బాధ్యులనే దానిపై స్పష్టత లేదు. ఈ ఘటనకు ముందు ఈ ప్రాంతంలోనే ఐదుగురు కూలీలను మిలిటెంట్లు చంపేశారు. పాకిస్తాన్‌లో ఎన్నికలకు మరో నెల రోజులు మాత్రమే సమయం ఉన్న ఈ తరుణంలో వరసగా ఉగ్రదాడులు అక్కడి ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాయి. పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాన్‌ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ (PICSS) థింక్ ట్యాంక్ యొక్క ఇటీవలి నివేదిక ప్రకారం, ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో నవంబర్‌లో 51 ఉగ్రదాడులు జరిగితే 54 మంది మరణించగా.. 81 మంది గాయపడ్డారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
-
Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్‌కు సౌండ్ నిల్..
-
Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్‌ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
-
India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్‌పై పరోక్ష విమర్శలు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!