లిబియాలో శరణార్థులతో వెళుతున్న ప్రమాదవశాత్తు ఓ పడవ బోల్తా కొట్టింది. అయితే… ఈ ప్రమాదంలో ఏకంగా 57 వరకు శరణార్థులు మరణించి ఉంటారని యూఎన్ మైగ్రేషన్ కు చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి గురైన ఆ పడవ లిబియా దేశం పశ్చిమ తీర పట్టణం ఖుమ్స్ నుంచి ఆదివారం రోజున బయలు దేరిందని అంతర్జాతీయ వలస దారుల సంస్థ లో ఉన్న కీలకమైన అధికారి సఫా మెహ్లీ అంటున్నారు. ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో… ఆ పడవలో ఏకంగా 75 మంది ఉన్నట్లు అంచనా వేసింది అల్ జబీరా. ఈ 75 మంది శరణార్థుల్లో.. 57మంది మరణించగా… మిగిలిన 18 మంది శరణార్థులు… సముద్రంలో ఈదుకుంటూ నిన్న రాత్రికి ఒడ్డుకు చేరినట్లు స్పష్టం చేశారు అధికారి సఫా మెహ్లీ. ఇక మృతి చెందిన 57 మంది శరణార్థులలో ఎక్కువగా.. నైజీరియా, ఘనా మరియు గాంబియా దేశాలకు చెందిన వారే ఉన్నట్లు అధికారులు తేల్చేశారు.