అమెరికాలోని టెక్సాస్‌లో రైలు పట్టాలు తప్పింది. 35 రైలు బోగీలు పట్టాలు తప్పాయి. బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదం జరగగానే అడవిలో మంటలు అంటుకున్నాయి. ప్రమాదకరమైన పదార్థాలు ఉండడంతో వెంటనే మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఇది కూడా చదవండి: Bengaluru: స్నేహితుడి భార్యతో ఎఫైర్.. చివరికిలా…!
టెక్సాస్‌లోని పాలో పింటో కౌంటీలోని గోర్డాన్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం రైలు పట్టాలు తప్పింది. కోల్‌విల్లే రోడ్‌పై ఉన్న వంతెనపై మధ్యాహ్నం 1:45 గంటల ప్రాంతంలో 35 బోగీలు పట్టాలు తప్పాయి. అందులో కొన్ని బోగీలు ప్రమాదకరమైన పదార్థాలను తీసుకువెళుతున్నట్లు సమాచారం. అత్యవసర సిబ్బంది స్పందించి ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఇక ప్రమాదానిక గల కారణాలను అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Rajasthan: ఘోరం.. వ్యాన్-కంటైనర్ ఢీ.. ఏడుగురు పిల్లలు సహా 11 మంది మృతి
WATCH: A train derailment in Gordon, Texas, has caused a huge mess and grass fires in Palo Pinto County.
Read more: https://t.co/SSjFXqHTHe pic.twitter.com/20wg84r2FP
— WFAA (@wfaa) August 12, 2025