Long Covid: కరోనా బాధితుల్లో తీవ్ర సమస్యలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా వచ్చి పోయినవారిలో దీర్ఘకాలికంగా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ సమయంలో లక్షలాది మంది ఆ మహమ్మారి బారినపడ్డారు.. కొంతమందిలో లక్షణాలు లేకుండా వైరస్ సోకడం.. తిరిగి కోలుకోవడం కూడా జరిగిపోయాయి.. వైరస్ సోకిందనే భయంతో ఎంతో మంది ప్రాణాలు కూడా విడిచారు. అయితే, కరోనా సోకిన వారిలో 30 శాతం మంది లాంగ్కోవిడ్తో బాధపడుతున్నట్లు ఓ అధ్యయనం తేల్చింది.. మొత్తం 1,038 మందిపై పరిశోధన నిర్వహించగా.. వారిలో 309 మందిలో లాంగ్ కోవిడ్ లక్షణాలు కనిపించాయని వెల్లడించారు.. ఇంకా కొందరిలో కొన్ని లక్షణాలు దీర్ఘకాలం పాటు వేధిస్తున్నట్లు ఆ అధ్యయనం తేల్చింది.
Read Also: KTR Tour: నేడు వరంగల్‌కు మంత్రి కేటీఆర్..
Also Read
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
- H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- China: "మనం శత్రువులం కాము".. భారత్‌కు చైనా సందేశం..
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న తర్వాత వారిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయనే దానిపై అమెరికా పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. ఈ పరిశోధనలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాఇ.. కోవిడ్ సోకి ఆస్పత్రిలో చేరినవారితోపాటు మధుమేహం, అధిక బరువు ఉన్న వారిలో పోస్ట్ అక్యూట్ సీక్వెలే ఆఫ్ కొవిడ్‌గా (పీఏఎస్సీ)గా పిలిచే ‘లాంగ్ కోవిడ్’ ఎక్కువగా కనిపిస్తున్నట్లు ఆ పరిశోధన గుర్తించింది.. కోవిడ్‌తో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నవారిలో అధికశాతం అలసట (31శాతం), శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (15 శాతం) వంటి లక్షణాలు ఉన్నాయని.. దీర్ఘకాలం పాటు ఈ సమస్య వారిని వెంటాడినట్టు తేల్చారు.. ఇక వాసన గుర్తించలేని పరిస్థితి 16 శాతం మందిలో కనిపించందని పేర్కొన్నారు.. కాగా, కోవిడ్ తర్వాత ప్రభావాలను తెలుసుకోవడం కోసం అమెరికా పరిశోధకులు చేపట్టిన ఈ పరిశోధనలో మొత్తం 1,038 మంది పరిస్థితులను పరిశీలించారు.. వీరిలో 309 మందిలో లాంగ్ కోవిడ్ లక్షణాలను గుర్తించారు.
తాజావార్తలు
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
-
Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
-
Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్‌లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
-
Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!