4-Day Work Week: యూకేలోని 200 కంపెనీలు కీలక నిర్ణయం.. వారానికి 4 రోజులే పని దినాలు!
- యునైటెడ్ కింగ్‌డమ్‌లోని 200 కంపెనీలు కీలక నిర్ణయం..
- వారానికి కేవలం నాలుగు రోజులే పని దినాలు..
- ఈ విధానం వల్ల ప్రజలు సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
4-Day Work Week: యునైటెడ్ కింగ్‌డమ్‌లో పని భారాన్ని తగ్గించడానికి అక్కడి కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సుమారు 200 బ్రిటీష్ కంపెనీలు తమ ఉద్యోగులందరికీ ఎటువంటి జీతం కోల్పోకుండా వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయాలని ప్రకటించాయి. ఇక్కడ, 5,000 మందికి పైగా ఉద్యోగులు మార్కెటింగ్, సాంకేతిక సంస్థల్లో విధులు నిర్వహిస్తున్నారు.
Read Also: Gas Cylinder Blast: ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరు మృతి, 8 మందికి సీరియస్..!
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్‌పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్‌నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
అయితే, 4- డే వీక్ ఫౌండేషన్ డైరెక్టర్ జో రైల్ మాట్లాడుతూ.. ఐదు రోజుల పని వారం అనేది గత 100 సంవత్సరాల క్రితం కనుగొనబడిందన్నారు. కాబట్టి, మేము కొత్తదనాన్ని తీసుకొచ్చాం.. వారంలో నాలుగు రోజుల పని దినాల తర్వాత ప్రజలు సంతోషంగా, సంతృప్తికరంగా జీవించడానికి కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. కాగా, ఈ విధానం యూకేలో మొదట మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, ప్రెస్ రిలేషన్స్ సంస్థలు ఆమోదించాయి.. ఆ తర్వాత కార్మికులు జీతం కోల్పోకుండా వారంలో నాలుగు రోజుల పాటు పని చేసిన తర్వాత కంపెనీలకు మంచి విజయాలు దక్కినట్లు బ్రిటిష్ కంపెనీలు గుర్తించాయి.. అందుకే, ఈ పద్దతిని అమలు చేయడానికి 200 కంపెనీలు రెడీ అయినట్లు జో రైల్ వెల్లడించారు.
Read Also: Ind vs Eng 3rd T20: నేడు భారత్- ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20.. సిరీస్పై కన్నేసిన టీమిండియా
ఇక, వారానికి నాలుగు రోజుల పని దినాలకు యూకే ఉప ప్రధాన మంత్రి ఏంజెలా రేనర్‌తో సహా లేబర్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ రాజకీయ నాయకుల మద్దతు లభించింది. కానీ, అధికారం చేపట్టినప్పటి నుంచి పార్టీ అధికారికంగా ఈ విధానాన్ని స్వీకరించలేదు. ది గార్డియన్ నివేదిక స్పార్క్ మార్కెట్ రీసెర్చ్ చేసిన సర్వేను ప్రకారం.. యువత సాంప్రదాయ పని విధానాలను వ్యతిరేకించే అవకాశం ఉందని పేర్కొంది. వారు 4-రోజుల పని సంస్కృతిని స్వీకరించే ఛాన్స్ ఉందని సూచించింది. యూకేలోని 18-34 ఏళ్ల వయస్సు గలవారిలో 78 శాతం మంది ఐదేళ్లలో వారంలో నాలుగు రోజుల పని చేయడం ఆనవాయితీగా మార్చుకోగా.. మరో 65 శాతం మంది పూర్తి స్థాయి విధులకు తిరిగి రావాలని కోరుకోవడం లేదని ది గార్డియన్ నివేదికలో తెలిపింది.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్‌తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..