Site icon NTV Telugu

Pakistani Nationals Arrested: అమెరికాలో నకిలీ వీసా రాకెట్‌ గుట్టురట్టు .. ఇద్దరు పాకిస్తానీయుల అరెస్టు

Usa

Usa

Pakistani Nationals Arrested: యూఎస్ లో నకిలీ ధ్రువీకరణ పత్రాలు, ఉద్యోగాలు సృష్టించి.. వాటిని చూపించి అక్రమంగా వీసాలు పొందుతున్న రాకెట్ గుట్టురట్టు అయింది. ఇలా అక్రమంగా పొందిన వీసాలను విదేశీయులకు అమ్మి డబ్బు సంపాదిస్తున్న ఇద్దరు పాకిస్తానీయులను అమెరికా ఎఫ్‌బీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్ పటేల్‌ వివరించారు.

Read Also: Bypolls 2025: ఆ నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు..

అయితే, టెక్సాస్‌లోని పాకిస్తాన్‌కు చెందిన అబ్దుల్‌ హాది, ముర్షిద్‌, మహమ్మద్‌ సల్మాన్‌లను ఎఫ్‌బీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరు నకిలీ ఉద్యోగాలు సృష్టించినట్లు ఫేక్ సర్టిఫికేట్లు సమర్పించి అక్రమంగా వీసాలు పొంది.. వాటిని విదేశీయులకు భారీ మొత్తంలో విక్రయించారు.. ఇందుకు ఈబీ-2, ఈబీ-3, హెచ్‌1బీ వీసా ప్రోగ్రామ్‌లను ఉపయోగించినట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్ పటేల్‌ తెలిపారు. అమెరికన్లకే ఉద్యోగాలు ఇస్తున్నట్లు.. లేబర్‌ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన అన్ని నిబంధనలు పాటిస్తున్నట్లు నకిలీ ఉద్యోగ ప్రకటనలను న్యూస్ పేపర్లలో ప్రచురించారు.. ఒక్కసారి అక్కడి నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత.. వారు వీసా కోరుకుంటున్న వారి కోసం గ్రీన్‌ కార్డులను మంజూరు చేయాలని యూఎస్ ఇమ్మిగ్రేషన్‌ విభాగాన్ని కోరినట్లు పేర్కొన్నారు.

Read Also: Penukonda: సైకిల్ తొక్కి ‘సైకిల్ యాత్ర’ను ప్రారంభించిన మంత్రి సవిత..!

ఇక, పాకిస్తానీయుల గుట్టు కాస్త బయట పడటంతో ఎఫ్‌బీఐ అధికారులకు పట్టుబడ్డారు. విచారణలో ముర్షిద్‌ అక్రమంగా అమెరికా పౌరసత్వం పొందేందుకు ట్రై చేసినట్లు తేలింది. వీరు కొన్ని ఏళ్ల నుంచి ఈ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఎఫ్‌బీఐ డల్లాస్‌ స్పెషల్ ఏజెంట్‌ వెల్లడించారు. జాతీయ భద్రతను కాపాడటానికి, ఇమిగ్రేషన్‌కు బలమైన చట్టాలు అవసరమని అతడు నొక్కి చెప్పుకొచ్చారు. నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరచగా.. కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరారు. దీనిపై ఈ నెల 30వ తేదీన తదుపరి విచారణ జరగబోతుంది. వీరు దోషులుగా తేలితే.. సుమారు 20 ఏళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది.

Exit mobile version