మేషం: ఈ రోజు మీరు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు.
వృషభం: ఈరోజు మీ ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను కలుస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు.
మిథునం: ఈ రోజు మీకు ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది.. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. ప్రయత్నకార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు.
కర్కాటకం: ఈ రోజు మీరు మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం మంచిది.. కొత్త కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడే అవకాశాలున్నాయి.. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.
సింహం: ఈ రోజు మీరు కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు.
కన్య: ఈ రోజు మీరు మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు.
తుల: ఈ రోజు కొన్ని విషయాలు మీకు మానసిక ఆందోళనను తొలగిస్తాయి.. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.
వృశ్చికం: ఈ రోజు మీరు తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం.
ధనుస్సు: ఈ రోజు మీ కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాలవల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి.
మకరం: ఈ రోజు మీరు విందులు, వినోదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి.
కుంభం: ఈ రోజు ఇప్పటి వరకు మీరు అనుభవిస్తూ వచ్చిన కష్టాలన్నీ క్రమేణ తొలగిపోతాయి. కొత్త కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రలతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు.
మీనం: ఈ రోజు మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్నిరంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు.