జులై 1 గురువారం దినఫలాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఉద్యోగస్తులకు ఓర్పు చాలా అవసరం. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక సత్‌కాలంను సద్వినియోగం చేసుకోండి. స్త్రీలు ప్రముఖుల సిఫార్సుతో దైవదర్శనాలను త్వరగా ముగించుకుంటారు. వృత్తుల వారి శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. విదేశీయానం కోసం చేసే యత్నాలు మందకొడిగా సాగుతాయి.
వృషభం : భాగస్వామిక వ్యవహారాలు, ఆర్థిక లాదాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. ఖర్చులు అధికమవుతాయి. ప్రయాణాలు బ్యాంకింగ్ పనులలో అప్రమత్తంగా మెలగండి. దైవ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తి పనులు కారణంగా కుటుంబ సభ్యులకు ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోలేకపోతారు.
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
మిథునం : పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి అనుకూలం. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. ప్రతి విషయంలోనూ స్వయం కృషిపైనే ఆధారపడటం మంచింది. మీ సంతానం చదువుల విషయంలో సంతృప్తి కానవస్తుంది. ఉద్యోగస్తులు అధిక శ్రమకు ఒత్తిడికి లోనవుతారు. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు
కర్కాటకం : స్త్రీలకు తల, కాళ్లు నరాలకు సంబంధించిన చికాకులు అధికంగా ఉంటాయి. ప్రణాళికా బద్ధంగా వ్యవహిరిస్తే రాజకీయ కళారంగాలకు చెందిన వారు లక్ష్యాలు సాధిస్తారు. స్పెక్యులేషన్, ఎలక్ట్రానికల్, ఎలక్ట్రికల్ రంగాల వారికి కలిసివచ్చును. ఉమ్మడి నిధుల నిర్వహణలో ఆచితూచి వ్యవహరించండి.
సింహం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి అనుకూలం. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. వృత్తులవారు ఎంత శ్రమించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థిక స్థితికి ఆటంకంగా నిలుస్తాయి. కొబ్బరి, పండ్లు, పూలు వ్యాపారులకు లాభదాకయం.
కన్య : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి అవకాశాలు లభిస్తాయి. కుటుంబీకుల మధ్య మనస్పర్థలు వస్తాయి. సినిమా రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. ఇంజనీరింగ్, వైద్య రంగాలపట్ల ఆసక్తి పెరుగును. సిమెంట్, ఇసుకు, ఇటుకు తాపి పనివారికి అభివృద్ధి. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
తుల : రవాణా రంగాలలో వారికి సామాన్యంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు ఎప్పటి నుంచో ఆగివున్న పనులు పునఃప్రారంభమవుతాయి. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతాయ. పూర్వ పరిచయ వ్యక్తుల కలయిక సంతృప్తినిస్తుంది. అన్ని రంగాలలోని స్త్రీలకు చాలా యోగ ప్రదంగా ఉండగలదు.
వృశ్చికం : కళంకారీ రంగాలలో వారికి అభిమాన బృందాలు పెరుగుతాయి. విదేశాలు వెళ్లుటకు చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్టాకిస్టులకు, బ్రోకర్లకు, ఏజెంట్లకు అనుకూలం. స్టేషనరీ రంగాలలో వారికి నిరుత్సాహం. ప్రచురణ, పత్రికా రంగంలోని వారికి మందకొడిగా ఉండగలదు. ఆధ్యాత్మిక చింత పెరుగుతుంది.
ధనస్సు : పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. ఐరన్, ఆల్కహాల్ వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితం. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఇంక్రిమెంట్ వంటి శుభవార్తలు అందుతాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
మకరం : వస్త్ర, వెండి, బంగారం వ్యాపారస్తులకు పనివారితో చికాకులు తప్పవు. బంధు వర్గాలతో గృహంలో సందడి నెలకొంటుంది. రావలసిన ధనం అందడంతో తనాఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. మీ సంతానం పై చదువుల కోసం విదేశీ యత్నాలు వాయిదాపడతాయి.
కుంభం : ఆర్థిక లావాదేవీలు అనుకున్న విధంగా లాభిస్తాయి. వ్యాపార విషయముల యందు ఉమ్మడి సమస్యలు తలెత్తవచ్చు. వైద్యులు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ అభిరుచి ఆశయాలకు తిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
మీనం : రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్థులు అధికారులకు విలువైన కానుకలు అందజేసి వారిని ప్రసన్నం చేసుకుంటారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించుట వల్ల అస్వస్థతకు లోనవుతారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!