మేషం : ఉద్యోగస్తులకు ఓర్పు చాలా అవసరం. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక సత్‌కాలంను సద్వినియోగం చేసుకోండి. స్త్రీలు ప్రముఖుల సిఫార్సుతో దైవదర్శనాలను త్వరగా ముగించుకుంటారు. వృత్తుల వారి శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. విదేశీయానం కోసం చేసే యత్నాలు మందకొడిగా సాగుతాయి. వృషభం : భాగస్వామిక వ్యవహారాలు, ఆర్థిక లాదాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. ఖర్చులు అధికమవుతాయి. ప్రయాణాలు బ్యాంకింగ్ పనులలో అప్రమత్తంగా మెలగండి. దైవ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తి పనులు కారణంగా…