History: పూర్వం ఏసీలు, కూలర్లు లేవు కదా? మరి అంత ఎండలో రాజులు, చక్రవర్తులు ఎలా బ్రతికారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
How Ancient Palaces Stayed Cool Without AC or Electricity in Summer: దేశంలో ప్రస్తుతం వేడి పెరుగుతోంది. సూర్యడి వేడి తాపానికి జనాలు అల్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో వేడి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీంతో కూలర్లు, ఎయిర్ కండిషనర్లు, ఫ్యాన్ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రజలు తమ తమ సామర్థ్యాలకు అనుగుణంగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. వాస్తవానికి.. ఈ రోజుల్లో వేడిని తగ్గించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ, ఎయిర్ కండిషనర్లు, కూలర్లు, ఫ్యాన్లు కనుగొనక ముందు పరిస్థితి ఏంటి? అసలు కరెంట్ లేనప్పుడు ఇళ్లను చల్లగా ఎలా ఉండేవారు? అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ముఖ్యంగా వేసవిలో రాజులు, రాణులు, చక్రవర్తుల వైభవోపేతమైన రాజభవనాలు ఎలా చల్లగా ఉండేవి? అనే ప్రశ్నలు మీ మదిలో వచ్చే ఉంటుంది. దీనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: India – Russia: కష్టకాలంలో కదిలొచ్చిన ‘మిత్రుడు’.. చమురు సంక్షోభంలో భారత్‌ను ఆదుకున్న రష్యా!
Also Read
- Harappa Facts: 'ఆ ముద్రపై కనిపిస్తున్న వ్యక్తి శివుడు కాదు..?' అమెరికన్ చరిత్రకారిణి వ్యాఖ్యలతో రాజుకున్న వివాదం!
- Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
- Ramanathaswamy Temple: సంపద, విద్య, మోక్షం.. ఈ 22 పవిత్ర బావుల్లో స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు మాయం!
- Subhas Chandra Bose Jayanti: “జై హింద్”.. నేతాజీ గురించి ఆసక్తికర విషయాలు..
పురాతన పర్షియన్ (ఇరాన్) సామ్రాజ్యం నుంచి ఈజిప్ట్ వరకు ఎడారి ప్రాంతాల్లో ఇళ్లను చల్లబరచడానికి ఒక వినూత్న సాంకేతికతను వాడేవారు. దీనిని పర్షియన్ భాషలో ‘బాద్‌గీర్’ అని, అరబిక్‌లో ‘బర్జీల్’ అని పిలుస్తారు. ఇవి భవనాలపై ఎత్తైన గోపురాలు లేదా మీనార్లలా కనిపిస్తాయి. ఈ విండ్ క్యాచర్స్ ఎత్తులో వీచే గాలిని పట్టుకుని కిందకు పంపిస్తాయి. ఆ గాలి భవనం లోపలికి వెళ్లే క్రమంలో చల్లబడుతుంది.
అంతేకాదు.. మరింత చల్లదనం కోసం, ఈ గాలి వచ్చే మార్గంలో లేదా ఇంట్లోని ప్రాంగణాల్లో పెద్ద పెద్ద పాత్రల్లో నీటిని ఉంచేవారు. గాలి ఆ నీటిపై నుంచి వెళ్లడం వల్ల ఏసీ కంటే అద్భుతమైన చల్లదనాన్ని ఇచ్చేది.
READ MORE: SRH vs DC: ఉప్పల్‌లో ‘ఆరెంజ్’ ఆర్మీ వర్సెస్ ‘ఢిల్లీ’ వార్ షురూ.. టాస్ ఎవరు గెలిచారంటే!
మన రాజస్థాన్‌లోని జైపూర్, జైసల్మేర్ వంటి కోటల్లోనూ ఇలాంటి టెక్నిక్స్ కనిపిస్తాయి. కోటల సమీపంలో లేదా లోపల భారీ మెట్ల బావులను నిర్మించేవారు. ఇవి కేవలం నీటి అవసరాలకే కాకుండా, కోట లోపల తేమను పెంచి వాతావరణాన్ని చల్లగా ఉంచడానికి దోహదపడేవి. పూర్వ కాలంలో ఇళ్లను సున్నపు రాయి (Lime-stone) లేదా మట్టితో కూడిన మందపాటి గోడలతో నిర్మించేవారు. ఇవి బయటి వేడిని లోపలికి రానివ్వకుండా అడ్డుకునేవి. ఒక, కోటల గోడలకు ఉండే సన్నని జాలి కిటికీలు (జరోఖాలు) ‘వెంచురీ ఎఫెక్ట్’ ద్వారా గాలి వేగాన్ని పెంచి లోపలికి చల్లటి గాలిని పంపేవి. ముగులాయిల కాలంలో రాజభవనాల కారిడార్లలో పెద్ద పెద్ద నీటి కుండలు లేదా కొలనులను ఏర్పాటు చేసేవారు. కిటికీల నుంచి వచ్చే వేడి గాలి ఈ నీటి తాకిడికి చల్లబడి గదుల్లోకి ప్రవేశించేది. ఇక సామాన్యుల విషయానికి వస్తే, ప్రతి ఊరిలోనూ చెరువులు, కుంటలు ఉండటం వల్ల సహజంగానే వాతావరణం చల్లగా ఉండేది. ఇళ్ల చుట్టూ పెరడు, పైన పెంకులు లేదా గడ్డి వాములతో కూడిన పైకప్పులు వేడిని సమర్థవంతంగా తగ్గించేవి.
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!