కంటోన్మెంట్ లో ఎలా గెలిపించారో.. జూబ్లీహిల్స్ లోనూ గెలిపించాలని కార్యకర్తలకు దిశానిర్థేశం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ అభివృద్ధి ముఖ్యమంత్రి తీసుకున్నారని.. కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనీ ఎర్రగడ్డ డివిజన్ లో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎర్రగడ్డ డివిజన్ లోని 2.16 కోట్ల రూపాయల వ్యయంతో నటరాజ్ నగర్, శంకర్లాల్ నగర్, ఛత్రపతి శివాజీ నగర్ వద్ద CC రోడ్లు వేయడం & నటరాజ్ నగర్, బంజారా నగర్, కమ్యూనిటీ హాల్ల పునరుద్ధరణ కు శంకుస్థాపన పనులు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మీర్జా రహమత్ బెగ్ ఖాద్రి ,మీర్జా రియాజ్ హాల్ హాసన్ ఎఫండీ, కౌసర్ మొహినుద్దీన్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ ,
కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ,నవీన్ యాదవ్, అజారుద్దీన్,జోనల్ కమిషనర్ హేమంత్ ,ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.
Also Read: Hyderabad: ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ లపై కొనసాగుతున్న విచారణ
ఎర్రగడ్డ డివిజన్ లో 2.16 లక్షల రూపాయల తో సీసీ రోడ్లకు & కమ్యూనిటీ శంకుస్ధాపన చేశామని మంత్రి పొన్నం చెప్పుకొచ్చారు. 54 లక్షల రూపాయలతో మురుగు నీటి కాలువల పునరుద్ధరణకు శంకుస్థాపన చేసుకున్నాం. పక్కన ఉన్న స్థలం ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్క్ ఏర్పాటు చేసుకుంటున్నాం..రేపటి నుండి పనులు ప్రారంభం అవుతాయని.. వాకింగ్ ట్రాక్ ,పిల్లల గేమ్స్ తదితర ఏర్పాటు చేస్తారు..అధికారులకు ఇప్పటికే ఆదేశించామన్నారు.
Also Read:Hyderabad: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ కసరత్తు..
డ్రింకింగ్ వాటర్ ,శానిటేషన్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ లో 60 వేలకు పైగా నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశాం.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ,500 కి గ్యాస్ అందిస్తున్నామన్నారాయన. కొంత మంది పిల్లలను తీసుకొచ్చి సానుభూతి తో ఓట్లు అడగాలని చూస్తున్నారు..ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారు. కంటోన్మెంట్ ఎన్నికల మాదిరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లకు సూచించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు..అధికార కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఇక్కడ కూడా డబుల్ బెడ్ రూం లు పంపిణీ చేస్తున్నామని.. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి జోడెద్దుల మాదిరి పని చేస్తుందని ఆయన అన్నారు.