కంటోన్మెంట్ లో ఎలా గెలిపించారో.. జూబ్లీహిల్స్ లోనూ గెలిపించాలని కార్యకర్తలకు దిశానిర్థేశం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ అభివృద్ధి ముఖ్యమంత్రి తీసుకున్నారని.. కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనీ ఎర్రగడ్డ డివిజన్ లో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎర్రగడ్డ డివిజన్ లోని 2.16 కోట్ల రూపాయల వ్యయంతో నటరాజ్ నగర్, శంకర్‌లాల్ నగర్, ఛత్రపతి శివాజీ నగర్…