ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ లపై ఇవాళ విచారణ కొనసాగుతోంది. ఈ నెల ఒకటో తేదీన జరగాల్సిన ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ ఈ రోజుకు వాయిదా పడింది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్ లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకెట్ల ను క్రాస్ ఎగ్జామ్ చేశారు చింతా ప్రభాకర్ అడ్వకెట్లు. అనంతరం గూడెం మహిపాల్ రెడ్డి పై అనర్హత వేటు వేయాలని MLA చింతా ప్రభాకర్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామ్ చేయనున్నారు బీఆర్ ఎస్ అడ్వకేట్లు.
Read Also: Hyderabad: దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో అపశృతి.. పల్టీ కొట్టిన క్రేన్…
పార్టీ పిరాయింపు ఆరోపణలతో భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్యేలలో నలుగురుపై అనర్హత వేటు వేసింది. పిటిషన్లపై బుధవారం విచారణ కొనసాగుతుంది. ఉదయం విచారణ ప్రారంభం కాగానే పిటిషనర్లు చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వరి రెడ్డి, ఇతరుల తరపున న్యాయవాదులు ఎమ్మెల్యేలు టి. ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్యల వాదనలు వినిపించారు. సాయంత్రం వరకు క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగింది. బుధవారం నాడు మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డిల వాదనలు న్యాయవాదులు వినలేకపోయారు. స్పీకర్ జి. ప్రసాద్ కుమార్ సమక్షంలో విచారణ వీరి విచారణ శనివారానికి వాయిదా వేశారు..
Read Also:Hyderabad: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ కసరత్తు..
పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఇద్దరు శాసనసభ్యుల వాదనలు వింటారు. మొదటి దశ విచారణ పూర్తయిన తర్వాత స్పీకర్ మరో నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు కూడా నోటీసులు అందజేశారు.నోటీసులకు స్పందించకపోతే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.