బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కారు..దిగి ఆటోలో ప్రయాణించారు. ఆటోలోనే.. తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. తెలంగాణలోని ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం దిశగా గులాబీ పార్టీ నేతలు ఆందోళనలు.. నిరసనలకు రెడీ అయ్యారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టారు. ఆటోల్లో ప్రయాణం చేస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎర్రగడ్డలో ఆటోలో ప్రయాణించి వారి సమస్యలు తెలుసుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సనత్ నగర్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్… వెంగళ్ రావు నగర్ లో ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆటోలో ప్రయాణించి.. వారి సమస్యలు విన్నారు.
Read Also: Wife Attacked Husband: ఏందమ్మా ఇది.. భర్త ఇళ్లు క్లీన్ చేయలేదని.. ఆ ఇళ్లాలు ఏం చేసిందో తెలుసా…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారు దిగారు. సోమవారం కేటీఆర్ తెలంగాణ భవన్కు వెళ్తున్నపుడు ఆయన ప్రయాణిస్తున్న కారు దిగి ఆటో ఎక్కారు. ఆటోలోనే తెలంగాణ భవన్ కు చేరుకున్నాడు. తెలంగాణలోని ఆరు లక్షలకుపైగా ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారిందని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
Read Also:Job at Google: అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. ఏకంగా 2.25 కోట్ల ప్యాకేజీతో కొలువు..!
తాను వచ్చిన మస్రత్ అలీ అనే వ్యక్తి ఆటోలోనే అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ప్రయాణించినట్లు కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఆటో డ్రైవర్లకు అన్నీ చేస్తామని రాహుల్ గాంధీ నాడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మస్రత్ అలీ తనకున్న రెండు ఆటోలు అమ్మి.. ఆయన ప్రస్తుతం కిరాయి ఆటో నడుపుతున్నట్లు చెప్పారని వివరించారు. ఆత్మహత్య చేసుకున్న 161మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. అనంతరం తెలంగాణ భవన్లో ఆటో డ్రైవర్లతో సమావేశమయ్యారు.. సమావేశమనంతరం.. తెలంగాణ భవన్ నుంచి ఆటోలో ప్రయాణం చేయనున్నారు కేటీఆర్.