సూపర్ స్టార్ కృష్ణను అప్పట్లో ఎంతో ఆరాధించేవారు. ఆయనకు ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆయన వారసుడు మహేష్ బాబు ప్రిన్స్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లోనే ప్రస్తుతం ఉన్న హీరోల్లో అందగాడు. ఈ హ్యాండ్సమ్ హీరోకు యూత్ ముఖ్యంగా అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనకు నమ్రతతో పెళ్ళైనప్పటికీ ఎంతోమంది తమ కలల రాకుమారుడిగా భావిస్తారు. ఇప్పుడు ఈ సూపర్ స్టార్ ఫ్యామిలీలో మరో ప్రిన్స్ గౌతమ్ ఘట్టమనేని. చిన్నప్పటి నుంచి ఈ టీనేజర్ కు టాలీవుడ్ లో ఉన్న ఫాలోయింగ్, క్రేజ్ చూస్తే తన తాతకు, తండ్రికి ఏమాత్రం తీసిపోడని అనిపిస్తుంటుంది. అందంలోనూ, హైట్ లోనూ, చురుకుదనంతోనూ అందరి దృష్టినీ ఆకట్టుకునే గౌతమ్ స్టార్ ఫ్యామిలీ నుంచి మూడవ తరం ప్రిన్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Read Also : “నో కామెంట్స్”… రూమర్స్ పై సమంత రియాక్షన్
ఈరోజు గౌతమ్ 15వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. 2006 ఆగష్టు 31న మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతులకు గౌతమ్ జన్మించాడు. మహేష్ బాబు మూవీ “1 నేనొక్కడినే” సినిమాలో హీరో చిన్నప్పటి పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకున్నాడు. అప్పుడు గౌతమ్ కు కేవలం 8 సంవత్సరాల వయస్సు మాత్రమే. 2018లో ప్రొఫెషనల్ స్విమ్మింగ్ నేర్చుకోవడం ప్రారంభించిన గౌతమ్ తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్‌లోని టాప్ 8 ఈతగాళ్ళలో స్థానం దక్కించుకున్నాడు. ఈతలోని నాలుగు విధానాల్లో గౌతమ్ అద్భుతంగా ఈదగలడు.
గౌతమ్ క్రికెట్ అంటే చాలా ఇష్టం. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతాన్ని గౌతమ్ ఆస్వాదిస్తాడు. గౌతమ్ హైట్ మరో ముఖ్యాంశం. అప్పుడే మహేష్ బాబు అంత ఎదిగిపోయాడు. ఈ ఫ్యూచర్ సూపర్ స్టార్ సినిమాల్లోకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా ? అని సూపర్ స్టార్ అభిమానులు ఆతృతగా ఎదురు చుస్తున్నారు. కాగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గౌతమ్ ఘట్టమనేనికి పుట్టినరోజు శుభాకాంక్షలు.