Explainer: అమెరికా వర్సెస్ ఇజ్రాయెల్..అస్త్రంగా ఇండియా! నెక్ట్స్ ఏం జరగనుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకే ఒక్క ప్రకటన.. అంతర్జాతీయ దౌత్య సమీకరణాలను ఒక్కసారిగా కుదిపేసింది! ‘అమెరికా తప్ప.. ఇజ్రాయెల్‌కు ప్రపంచంలో మరే శక్తివంతమైన మిత్రదేశం లేదు, ఒంటరిగా మిగిలిపోయిన వేళ అమెరికాతో పెట్టుకోవద్దు’ అంటూ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ చేసిన హెచ్చరిక, ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. అయితే, ఈ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంతే దీటుగా తిప్పికొట్టారు. ‘మాకు అమెరికా మాత్రమే కాదు.. 140 కోట్ల జనాభా కలిగిన భారత్ అనే మరో గొప్ప మిత్రదేశం ఉందంటూ’ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ లో సరికొత్త చర్చకు దారితీశాయి. గాజా, ఇరాన్, లెబనాన్లతో సుదీర్ఘ యుద్ధాలు, అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న తరుణంలో.. నెతన్యాహు భారత్‌ను ఎందుకు అడ్డుగా పెట్టుకోవాల్సి వచ్చింది? అమెరికాను ఇజ్రాయెల్ సవాల్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? దౌత్యపరమైన ఒంటరితనం నుంచి బయటపడేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందా?
వైట్ హౌస్ ప్రెస్ బ్రిఫింగ్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ చేసిన వ్యాఖ్యలు.. అమెరికా-ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాల బంధానికి బీటలు వారేలా చేస్తున్నాయి. గత నెలలో ఇరాన్‌తో అమెరికా ఒక చారిత్రాత్మక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యుద్ధానికి ముగింపు పలికే క్రమంలో జరిగిన ఈ పరిణామంపై ఇజ్రాయెల్ కేబినెట్ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై వ్యాన్స్ ఘాటుగా స్పందించారు. “నేనే గనుక ఇజ్రాయెల్ కేబినెట్లో ఉంటే.. ప్రపంచంలో మిగిలి ఉన్న ఏకైక శక్తివంతమైన మిత్రదేశంపై దాడి చేసేవాడిని కాదు” అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. డొనాల్డ్ ట్రంప్‌ను ఇజ్రాయెల్‌కు లభించిన “అత్యంత గొప్ప స్నేహితుడు”గా నెతన్యాహు గౌరవిస్తున్నప్పటికీ, వ్యాన్స్ చేసిన ఈ ‘ఒంటరి’ వ్యాఖ్యలు నెతన్యాహు అహాన్ని దెబ్బతీశాయి. ఫలితంగా నెతన్యాహు కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది.
జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నెతన్యాహు, అమెరికా భ్రమలను పటాపంచలు చేసేందుకు ‘భారత్’ అనే అస్త్రాన్ని ప్రయోగించారు. “మాకు ఇండియా అనే ఒక చిన్న దేశం స్నేహితుడిగా ఉంది. అక్కడ 1.4 బిలియన్ల ప్రజలు ఉన్నారు. అక్కడ మాకు లభిస్తున్న మద్దతు సామాన్యమైనది కాదు, అద్భుతమైనది” అని నెతన్యాహు ప్రకటించారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఫేస్బుక్’ వేదికగా భారతీయుల నుంచి ఇజ్రాయెల్‌కు వరదలా వస్తున్న అపారమైన మద్దతును ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ సైనిక చర్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ, నెతన్యాహుకు భారతీయుల నుంచి లభిస్తున్న ఈ డిజిటల్ మద్దతు అంతర్జాతీయ వేదికలపై డిఫెన్స్ మెకానిజమ్‌గా ఉపయోగపడుతోంది.
Also Read
అంతర్జాతీయ దౌత్యంలోని ద్వంద్వ ప్రమాణాలను, సోషల్ మీడియా మైండ్ గేమ్స్‌ను నెతన్యాహు ఎండగట్టారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ‘యాంటీ ఇజ్రాయెల్’, ‘యాంటీ సెమిటిక్’ ప్రచారాలు చేయడం ఒక ఫ్యాషన్‌గా మారిందని నెతన్యాహూ విమర్శించారు. అయితే, పైకి విమర్శలు గుప్పించే దేశాల నేతలే, తెరవెనుక ఇజ్రాయెల్‌కు ఫోన్లు చేస్తున్నారని నెతన్యాహు సంచలన విషయాన్ని బయటపెట్టారు. తమతో వ్యాపార ఒప్పందాలు చేసుకోవడానికి, అలాగే ఇజ్రాయెల్ మిలిటరీ నైపుణ్యాలను, వ్యూహాలను తమకు నేర్పించాల్సిందిగా ఆయా దేశాల ప్రతినిధులు కోరుతున్నారని ఆయన వెల్లడించారు. అంటే బాహ్య ప్రపంచానికి కనిపించే రాజకీయాలకు, తెరవెనుక జరిగే రక్షణ దౌత్యానికి పొంతన లేదని ఆయన స్పష్టం చేశారు.
లెబనాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలపైన, రక్షణ వ్యూహాలపైన నెతన్యాహు ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. అమెరికా-ఇరాన్ ఒప్పందం ప్రకారం లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ దళాలను వెనక్కి తీసుకోవాలనే నిబంధన ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ ఇప్పటివరకు దానికి లొంగలేదు. అనేక రౌండ్ల కాల్పుల విరమణ ప్రకటనలు వచ్చినప్పటికీ ఇజ్రాయెల్ వెనక్కి తగ్గకపోవడానికి నెతన్యాహు ఒక వింత కారణాన్ని చెప్పారు. దక్షిణ లెబనాన్‌లోని కొన్ని క్రైస్తవ గ్రామాల ప్రజలే స్వయంగా ఇజ్రాయెల్‌ను సంప్రదించారని, హెజ్బొల్లా ఉగ్రవాదుల నుంచి తమను రక్షించడానికి ఆయా గ్రామాలను ఇజ్రాయెల్‌లో విలీనం చేసుకోవాలని కోరినట్లు నెతన్యాహు వెల్లడించారు. స్తవ మతస్థులను రక్షించడంలో ఇజ్రాయెల్ ముందుంటుందని ఆయన వాదించారు.
ఈ మొత్తం పరిణామాలను గమనిస్తే.. అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది మరోసారి అర్థమవుతోంది. అమెరికా పెత్తనాన్ని ప్రశ్నిస్తూ, భారతదేశాన్ని అడ్డుపెట్టుకుని నెతన్యాహు ఆడుతున్న ఈ అంతర్జాతీయ మైండ్ గేమ్ ఎటు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
: CLN RAJU (EDITOR- NTV DIGITAL)
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!