America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాను నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే…! ఎందుకో తెలుసా.. నమ్మించి మోసం చేయడం ఆ దేశం డీఎన్ఏలోనే ఉంది. సౌదీ అరేబియా కూడా ఇప్పుడు అలానే మోసపోయింది. మధ్యప్రాచ్యంలో వేగంగా మారుతున్న పరిణామాలను చూస్తుంటే… సౌదీని అమెరికా ఏ స్థాయిలో చీట్ చేసిందో అర్థమవుతుంది. హౌతీలతో లోపయకారి ఒప్పందం చేసుకున్న అమెరికా… సౌదీని రోడ్డున పడేసింది.
యెమెన్ లో అన్సార్ అల్లా గా పిలిచే హౌతీ రెబల్స్ తిరిగి విజృంభిస్తున్నారు. ఎర్ర సముద్రం తీరంతో పాటు సౌదీ చమురు ఎగుమతులకు కీలకమైన బాబ్ ఎల్-మండెబ్ జలసంధి వెంబడి ఉన్న పలు దీవులను హౌతీలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంతేకాదు… సౌదీ నగరాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై డ్రోన్లు, క్షిపణులతో తీవ్ర దాడులు చేస్తున్నారు. పవిత్ర నగరమైన మక్కాలో ఒక డ్రోన్ దాడికి కూడా ప్రయత్నించారు. అయితే సౌదీ అప్రమత్తంగా ఉండి ఆ దాడిని తిప్పికొట్టింది.
సౌదీకి మద్దతుగా నిలవాల్సిన మిత్రదేశాలు ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నాయి. మక్కా డిఫెన్స్ అలయన్స్ లో ఉన్న పాకిస్థాన్, టర్కీ దేశాలు యెమెన్ లో పోరాడేందుకు పూర్తిగా నిరాకరించాయి. అటు అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్ కూడా హౌతీల స్థావరాలపై వైమానిక దాడులు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మిత్ర దేశం సౌదీకి అండగా ఉండాల్సిన అమెరికా… మూడో కంటికి తెలియకుండా… ఒమన్ రాజధాని మస్కట్ లో హౌతీతో రహస్యంగా చర్చలు జరిపింది.
Also Read
ఇరాన్ తో యుద్ధంలో చిక్కుకున్న అమెరికా వద్ద.. ఇప్పుడు హౌతీలపై పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు తగిన వనరులు లేవు. అందుకే ఎర్ర సముద్రంలో తమ నౌకలపై దాడులు చేయబోమన్న హౌతీల హామీకి అమెరికా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇజ్రాయెల్, అంతర్జాతీయ నౌకలను వదిలేసి.. కేవలం సౌదీ అరేబియా నౌకలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటామని హౌతీ ప్రతినిధులు అమెరికాకు స్పష్టం చేశారు. అమెరికా ప్రయోజనాలకు భంగం కలగకపోవడంతో ఈ షరతులకు వాషింగ్టన్ మౌనంగా అంగీకరించినట్లు మాజీ దౌత్యవేత్తలు భావిస్తున్నారు.
అమెరికా వ్యూహాత్మక మౌనం ఇప్పుడు సౌదీ అరేబియాను తీవ్ర ఇరకాటంలోకి నెట్టేసింది. వందలాది వైమానిక దాడులు చేసినప్పటికీ అన్సార్ అల్లా దళాలను సౌదీ నిలువరించలేకపోయింది. పరిస్థితి విషమించడంతో ఇంటెలిజెన్స్ సమాచారం కోసం ఇజ్రాయెల్ ను సౌదీ అరేబియా ఆశ్రయించినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఇజ్రాయెల్‌ను ఒక స్వతంత్ర దేశంగా సౌదీ ఇప్పటి వరకు గుర్తించలేదు. మిత్రదేశాలు సాయం చేసేందుకు ముందుకు రాకపోవడంతో.. యెమెన్ యుద్ధంలో సౌదీ అరేబియా ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తోంది.
తాజావార్తలు
-
America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
-
LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!