Explainer: మళ్లీ అక్టోబర్ 7 తరహా దాడులు..? ఇజ్రాయెల్‌ను చుట్టుముట్టిన నాలుగు దేశాలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబర్ 7..ఈ తేదీ గుర్తురాగానే ఇజ్రాయెల్ ప్రజల కళ్ల ముందు ఇప్పటికీ ఒకే దృశ్యం మెదులుతుంది. ఆ ఉదయం.. ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగసిన రాకెట్లు.. సరిహద్దులు దాటుకొచ్చిన వందలాది మంది హమాస్ మిలిటెంట్లు.. ఇళ్లలోకి, వీధుల్లోకి, పండుగ కోసం బయటకు వచ్చిన జనాల మధ్యకి చొచ్చుకొచ్చిన హింస.. కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ అంతా ఒక భయంకరమైన షాక్‌లోకి జారిపోయింది.
ప్రపంచం టీవీ తెరల ముందు కూర్చుని ఆ దృశ్యాలను చూస్తూ ఉండిపోయింది. ఆ రోజు మొదలైన యుద్ధం తర్వాత మధ్యప్రాచ్యం ఇప్పటికీ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోలేదు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్‌ను వెంటాడుతున్న భయం అక్టోబర్ 7 జ్ఞాపకం గురించి మాత్రమే కాదండి.. అదే స్థాయి షాక్ మరోసారి వస్తుందేమోననే టెన్షన్ ఆ దేశంలో కనిపిస్తోంది.
Also Read
- Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
- Mobile Sales: అమ్మో.. స్మార్ట్ ఫోన్..! అంత పెట్టి కొనలేం బాబోయ్
- Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
ఈసారి మరింత పెద్ద రూపంలో వస్తే ఎలా ఉంటుందన్న భయం నెలకొంది. హమాస్ ఒక్క వైపు నుంచి దాడి చేసిన ఆ రోజు ప్రపంచాన్ని కుదిపేసింది. ఇప్పుడు ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న అనేక సాయుధ గ్రూపులు ఒకేసారి కదిలితే? ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న నాలుగు దిశలు ఒకేసారి యుద్ధభూములుగా మారితే? ఉత్తరాన లెబనాన్‌లో హిజ్బుల్లా ఉంది. దక్షిణాన గాజాలో హమాస్ ఉంది. సముద్రం అవతల యెమెన్‌లో హౌతీలు ఉన్నారు. మరోవైపు ఇరాక్‌లో ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న సాయుధ గ్రూపులు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటిగా కదిలితే ఒక కథ.. ఒకేసారి కదిలితే మరో కథ. ఇజ్రాయెల్‌కు ఇప్పుడు భయపెడుతున్న కథ అదే.
అక్టోబర్ 7న ఏం జరిగిందో ప్రపంచం చూసింది. ఒకే దిశ నుంచి వచ్చిన ఆకస్మిక దాడి ఎంతటి విధ్వంసాన్ని సృష్టించగలదో ఆ రోజు నిరూపించింది. ఇప్పుడు ఆ అనుభవాన్ని ఇరాన్ తన మిత్ర సాయుధ గ్రూపులతో కలిసి మరింత విస్తరించే ప్రయత్నం చేస్తోందన్న అనుమానాలు ఉన్నాయి.
హిజ్బుల్లా కమాండర్లతో ఇరాన్ కుద్స్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతున్నట్టు.. హౌతీలు, ఇరాక్‌లోని ఇరాన్ అనుకూల గ్రూపులతో కూడా సమన్వయం జరుగుతున్నట్టు నివేదికలు వెలువడుతున్నాయి. ఒక వైపు గాజా.. మరో వైపు లెబనాన్.. దూరంగా యెమెన్.. ఇరాక్ వైపు నుంచి మరో ముప్పు.. ఇలా ప్రతి దిశలో ఒక యుద్ధపు నీడ నిలబడితే ఇజ్రాయెల్ మధ్యలో చిక్కుకునే పరిస్థితి ఏర్పడొచ్చు. అదే సమయంలో అమెరికా, ఇరాన్ మధ్య కూడా మళ్లీ మంటలు రేగుతున్నాయి. హోర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ చమురు రవాణాపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రపంచానికి కీలకమైన సముద్ర మార్గం కూడా యుద్ధపు నీడలోకి వెళ్లిపోయింది. ఇరాన్ తన క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యాన్ని తిరిగి పెంచుకుంటున్నట్టు సమాచారం.
ఇజ్రాయెల్ మాత్రం తన చుట్టూ ఉన్న ప్రతి కదలికను గమనిస్తోంది. ఎందుకంటే ఒక రాత్రి ఆకాశంలో ఒక క్షిపణి కనిపించడం ఒక విషయం.. అదే సమయంలో ఉత్తర సరిహద్దు నుంచి కాల్పులు మొదలై.. దక్షిణం నుంచి రాకెట్లు వస్తే పరిస్థితి భీకరంగా మారడం మరో విషయం. అంతే కాదు.. అదే సమయంలో సముద్రం వైపు నుంచి డ్రోన్లు దూసుకొచ్చి, మరో వైపు నుంచి సాయుధ గ్రూపులు రంగంలోకి దిగితే ఇజ్రాయెల్ తనని తాను ఎలా కాపాడుకోగలదు?
అక్టోబర్ 7 ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పుడు అదే జ్ఞాపకం మరోసారి ఇజ్రాయెల్ గుండెల్లో భయంగా మారుతోంది. ఎందుకంటే ఈసారి భయం ఒక అక్టోబర్ 7 మళ్లీ వస్తుందన్నదాని కంటే పెద్దది.. ఒకే రోజు నాలుగు అక్టోబర్ 7లు నాలుగు వైపుల నుంచి ఒకేసారి విరుచుకుపడితే ఏమవుతుందన్నదే అసలు భయం.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!