Hellfire Missile Explained: అమెరికా సీక్రెట్ వెపన్.. టార్గెట్ ఫిక్స్ చేసి కొడితే శత్రు నౌకల గుండెలు పేలాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతులేని సముద్రం… చుట్టూ ఎక్కడ చూసినా నీలి రంగు జలాలే… ఒమాన్ గల్ఫ్ జలాల్లో ఒక వాణిజ్య నౌక నెమ్మదిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. కానీ ఆ నౌకపై మాత్రం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం కన్నేసింది. ఆకాశంలో అమెరికా యుద్ధ విమానాలు గస్తీ కాస్తున్నాయి. రేడియో ద్వారా ఒకసారి కాదు… రెండుసార్లు కాదు… 20కి పైగా హెచ్చరికలు పంపించాయి. దిశ మార్చుకోవాలని సూచించాయి. కానీ నౌక ముందుకు సాగుతూనే ఉంది. ఉద్రిక్తత క్షణక్షణానికి పెరుగుతోంది.
ఆ తర్వాత ఒక్కసారిగా ఆకాశంలో నుంచి ఒక క్షిపణి దూసుకొచ్చింది. కొన్ని క్షణాల్లోనే నౌకను తాకింది. అయితే ఆ నౌక మునిగిపోలేదు. పేలుళ్లతో ఛిద్రమైపోలేదు. సిబ్బందికి కూడా పెద్ద ప్రమాదం జరగలేదు. అయినప్పటికీ నౌక అక్కడికక్కడే ఆగిపోయింది. అయితే ఇంత కచ్చితంగా దాడి చేసి లక్ష్యాన్ని మాత్రమే నిలిపివేయగలిగిన ఆ ఆయుధం ఏంటి? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన హెల్ ఫైర్ మిసైల్ కథేంటి?
ఇటీవల అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన వివరాల ప్రకారం గాంబియా జెండాతో ప్రయాణిస్తున్న లియాన్ స్టార్ అనే వాణిజ్య నౌక ఇరాన్ పోర్టు వైపు కదులుతోంది. అమెరికా ఆ నౌకకు పదేపదే హెచ్చరికలు జారీ చేసింది. అయితే నౌక తన మార్గాన్ని మార్చుకోకపోవడంతో చివరికి ఒక హెల్ ఫైర్ క్షిపణిని ప్రయోగించింది.
Also Read
- Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? పరిశోధనలో బయటపడ్డ నమ్మలేని నిజాలు
- Explainer: గే, ట్రాన్స్జెండర్ల దూకుడు.. రెయిన్బో సునామీలో ట్రంప్ గల్లంతు!
- Abdul El-Sayed: అమెరికా సెనెట్లోకి కర్ణాటక అల్లుడు.. ట్రంప్‌కి దిమ్మదిరిగి బొమ్మ కనపడింది భయ్యా!
- Elon Musk: ఎవడైతే కత్తితో యుద్ధం చేస్తాడో, వాడు కత్తిపోటుకే బలవుతాడు.. మస్క్‌కు మున్ముందు మొసళ్ల పండగే!
హెల్ ఫైర్ పుట్టుక వెనుక నిజం ఏంటి?
ఆ క్షిపణి నేరుగా నౌక ఇంజిన్ గదిని లక్ష్యంగా చేసుకుంది. దాడి జరిగిన వెంటనే నౌక ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అది ఇరాన్ వైపు ప్రయాణాన్ని కొనసాగించలేకపోయింది. అందుకే ఇప్పుడు అందరి దృష్టిని ఆ క్షిపణి ఆకర్షిస్తోంది. హెల్ ఫైర్ అనే పేరు చాలా మందికి తెలిసినా అది ఎలా పనిచేస్తుందో మాత్రం చాలామందికి తెలియదు. ఈ క్షిపణి కథ దాదాపు 50ఏళ్ల క్రితం ప్రారంభమైంది. 1970ల కాలంలో శత్రు ట్యాంకులను గాల్లో నుంచే ధ్వంసం చేయగల శక్తివంతమైన ఆయుధం అవసరమని అమెరికా సైన్యం భావించింది. ఆ ఆలోచన నుంచే హెల్ ఫైర్ జన్మించింది. మొదట ట్యాంకులను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ క్షిపణి కాలక్రమేణా అనేక మార్పులు పొందింది. యుద్ధభూమిలో కీలక లక్ష్యాలను కూల్చివేయడం నుంచి నగర ప్రాంతాల్లో అత్యంత కచ్చితమైన దాడులు నిర్వహించడం వరకు ఎన్నో విధాలుగా దీన్ని ఉపయోగించారు.
హెల్ ఫైర్ ప్రత్యేకతలేంటి?
దాదాపు 100పౌండ్ల బరువు ఉండే ఈ క్షిపణి 7మైళ్లకు దగ్గరగా ఉన్న లక్ష్యాలను సైతం ఛేదించగలదు. ముఖ్యంగా అమెరికా ఆర్మీకి చెందిన అపాచీ అటాక్ హెలికాప్టర్లతో దీని పేరు విడదీయరాని బంధంగా మారిపోయింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా భారీగా వినియోగించే ఎంక్యూ నైన్ రీపర్ డ్రోన్లలో కూడా ఇది ప్రధాన ఆయుధంగా ఉంటుంది. చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ లక్ష్యాన్ని తాకే కచ్చితత్వం కారణంగా దీనికి ప్రత్యేక గుర్తింపు లభించింది.
అసలు ఈ క్షిపణి తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంటుంది? సాధారణ హెల్ ఫైర్ లేజర్ గైడెన్స్ సాంకేతికతతో పనిచేస్తుంది. లక్ష్యంపై లేజర్ కాంతిని ప్రసరింపజేస్తారు. ఆ కాంతిని అనుసరిస్తూ క్షిపణి నేరుగా లక్ష్యాన్ని చేరుకుంటుంది. మరికొన్ని ఆధునిక వెర్షన్లు మిల్లీమీటర్ వేవ్ రాడార్ సాంకేతికతను ఉపయోగిస్తాయి. దీంతో పొగమంచు ఉన్నా… వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా… లక్ష్యాన్ని గుర్తించి దాడి చేయగలవు.
అయితే లియాన్ స్టార్ ఘటనలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే అమెరికా నౌక మొత్తాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించలేదు. కేవలం ఇంజిన్ గదినే లక్ష్యంగా ఎంచుకుంది. ఎందుకంటే లక్ష్యం నౌకను ముంచేయడం కాదు. దాని ప్రయాణాన్ని ఆపడం. ఇంజిన్ పనిచేయకుండా చేస్తే నౌక సముద్రంలో నిలిచిపోతుంది. సిబ్బందికి పెద్ద ప్రమాదం లేకుండా పరిస్థితిని అదుపులోకి తీసుకురావచ్చు. ఇదే హెల్ ఫైర్ క్షిపణి ప్రత్యేకత. అవసరమైన చోట మాత్రమే దెబ్బ కొట్టడం. మిగతా నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడం.
కానీ ఈ ఘటన ఒక క్షిపణి సామర్థ్యాన్ని మాత్రమే చూపించడం లేదు. మధ్యప్రాచ్యంలో మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలకు కూడా ఇది సంకేతంగా కనిపిస్తోంది. హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక మార్గాల్లో ఒకటి. ఇక్కడ చిన్న ఉద్రిక్తత కూడా అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ సముద్రంలో మాత్రం పరిస్థితి ఇంకా పూర్తిగా ప్రశాంతంగా మారలేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఒకప్పుడు ట్యాంకులను వేటాడేందుకు రూపొందించిన హెల్ ఫైర్ క్షిపణి… ఇప్పుడు డ్రోన్ల నుంచి ప్రయోగించబడుతూ ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన సైనిక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషిస్తోంది. ఒమాన్ గల్ఫ్‌లో జరిగిన తాజా ఘటన మరోసారి ఒక విషయాన్ని స్పష్టం చేసింది.
ఆధునిక యుద్ధాల్లో విజయం కేవలం భారీ విధ్వంసంలో లేదు. అవసరమైన లక్ష్యాన్ని అత్యంత కచ్చితంగా నిర్వీర్యం చేయగల సామర్థ్యంలో ఉంది. హెల్ ఫైర్ మిసైల్ ఆ సామర్థ్యానికి నేటి ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ ఉదాహరణగా నిలుస్తోంది.
తాజావార్తలు
-
AP MPTC ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌పై డీజీపీ కీలక ప్రకటన.. ఉపేక్షించేది లేదని వార్నింగ్..
-
Jon Ossoff: 2028 యూఎస్ ప్రెసిడెంట్ రేసులో 39 ఏళ్ల కుర్రాడు? ఎవరీ జాన్ ఒసాఫ్!
-
Egg Mayonnaise Ban: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం
-
Teacher Dies During Election Duty: ఎన్నికల విధుల్లో ప్రాణాలు కోల్పోయిన టీచర్.. చంద్రబాబు, పవన్, లోకేష్ సంతాపం
-
Cristiano Ronaldo Retirement: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రొనాల్డో గుడ్‌బై..! ఎమోషనల్ వీడియో విడుదల..
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!