EXPLAINER: పెట్రోల్, ఇథనాల్‌లో ఏది వాడితే మీ డబ్బులు సేవ్ అవుతాయి? E100తో బండి తుక్కు అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కసారి ఊహించండి. మీరు పెట్రోల్ బంక్‌కి వెళ్లారు. ఒకవైపు లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయలకు పైగా కనిపిస్తోంది. మరోవైపు అదే బంక్‌లో ఉన్న మరో ఇంధనం దాదాపు 20రూపాయలు తక్కువ ధరకు దొరుకుతోంది. అప్పుడు ఎవరైనా ఏం అనుకుంటారు? తక్కువ ధర ఉన్నదే ఎక్కువ లాభమని భావిస్తారు. కానీ ఇంధనాల విషయంలో కనిపించేది ఒకటి, అసలు లెక్క మాత్రం మరోటి. ప్రస్తుతం భారత్‌లో చర్చకు కారణమైన ఈ ఇంధనం పేరు E85. లీటర్ ధర తక్కువగా ఉండటంతో చాలా మందికి ఇది భవిష్యత్తు ఇంధనంలా కనిపిస్తోంది. అయితే పెట్రోల్ కంటే చీప్‌గా కనిపించే ఈ ఇంధనం నిజంగానే మన జేబుకు మేలు చేస్తుందా?
దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఇంధనం అంటే కేవలం ద్రవం కాదని తెలుసుకోవాలి. ప్రతి ఇంధనంలో శక్తి ఉంటుంది. మన కారు ఆ శక్తినే ఉపయోగించి ముందుకు కదులుతుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం.
ఇద్దరు పిల్లలకు ఒకే పరిమాణంలో ఉన్న రెండు బ్యాగులు ఇచ్చారని అనుకోండి. బయటకు చూస్తే రెండూ ఒకేలా కనిపిస్తాయి కానీ.. ఒక బ్యాగులో ఎక్కువ పుస్తకాలు ఉంటే, మరొక బ్యాగులో తక్కువ పుస్తకాలు ఉంటే వాటి బరువు ఒకేలా ఉండదు. ఫ్యూయల్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఒక లీటర్ పెట్రోల్‌లో ఉన్న శక్తి, ఒక లీటర్ ఇథనాన్లో ఉండే శక్తి కంటే ఎక్కువగా ఉంటుంది. E20 అంటే 20శాతం ఇథనాల్, 80శాతం పెట్రోల్ కలిపిన మిశ్రమం. ప్రస్తుతం భారత్‌లో ఎక్కువగా ఉపయోగిస్తున్న ఇంధనం ఇదే. అయితే E85లో మాత్రం 85శాతం వరకు ఇథనాల్ ఉంటుంది. అంటే పెట్రోల్ పరిమాణం చాలా తక్కువ. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది.
Also Read
- POK: 'మా ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోండి..' పాక్ ఆక్రమిత కశ్మీర్లో కొత్త పోరాటం..!
- Explainer: ఎల్‌నినో ఎఫెక్ట్.. రైతులకు డబుల్ షాక్.. నిత్యావసర ధరలు పెరుగుతాయా?
- Explainer: బ్రిటన్ ఎందుకు తగలబెడుతోంది? వలసదారులపై ఎందుకింత ఆగ్రహం?
- Explainer: ప్రేమిస్తే జైలుకు..? శృంగారంలో పరస్పర అంగీకారం ఉన్నా కూడా రే*ప్ కేసు అవుతుందా?
ఇథనాల్ వాడితే మైలేజీ తగ్గుతుందా?
ఇథనాల్‌లో పెట్రోల్ కంటే దాదాపు 30శాతం తక్కువ శక్తి ఉంటుంది. అందుకే కారు అదే దూరం వెళ్లాలంటే ఎక్కువ ఇంధనాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. ఒక కారు E20 మీద లీటరుకు 18కిలోమీటర్లు వెళ్తుందని అనుకుందాం. అదే కారు E85 ఉపయోగిస్తే లీటరుకు 13 లేదా 14 కిలోమీటర్లకు మాత్రమే పరిమితం కావచ్చు. ఇప్పుడు లెక్కలు చూస్తే ఆసక్తికరమైన విషయం బయటపడుతుంది. 100 కిలోమీటర్లు ప్రయాణించాలంటే E20తో దాదాపు 567రూపాయలు ఖర్చవుతుంది. కానీ E85తో అదే 100 కిలోమీటర్లకు దాదాపు 608రూపాయలు ఖర్చవుతుంది. అందుకే లీటర్ ధర చూసి మాత్రమే ఇంధనం చౌక అని చెప్పలేం. ఆ ఇంధనంతో కారు ఎంత దూరం వెళ్తుందనేదే అసలు లెక్క. అయితే ప్రపంచంలో కొన్ని దేశాలు ఇథనాల్‌ను ఎందుకు అంతగా ప్రోత్సహిస్తున్నాయనే సందేహం రావచ్చు.
ఇండియాకు బ్రెజిల్ నేర్పుతున్న పాఠమేంటి?
దీనికి బెస్ట్ ఎగ్జాంపూల్ బ్రెజిల్. దాదాపు 5దశాబ్దాల క్రితం ప్రపంచాన్ని చమురు సంక్షోభం కుదిపేసినప్పుడు బ్రెజిల్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి చమురును దిగుమతి చేసుకోవడం మీద ఆధారపడకుండా తమ దేశంలో విస్తారంగా పండే చెరకు నుంచి ఇథనాల్ తయారు చేయడం ప్రారంభించింది. క్రమంగా అక్కడి కార్లను ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలుగా మార్చారు.
అంటే పెట్రోల్ అయినా, ఇథనాల్ అయినా, రెండింటి మిశ్రమమైనా వాడగలిగేలా తయారుచేశారు. నేడు బ్రెజిల్లో లక్షలాది వాహనాలు ఇథనాల్‌పై నడుస్తున్నాయి. అయితే బ్రెజిల్ ప్రజలు కూడా ఒక సింపుల్ రూల్‌ను పాటిస్తారు. ఇథనాల్ ధర పెట్రోల్ ధరలో 70శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అది నిజంగా ప్రాఫిట్ అని భావిస్తారు. ఎందుకంటే తక్కువ శక్తి ఉండటం వల్ల ఎక్కువ ఇంధనం ఖర్చవుతుందని వారికి తెలుసు. అయితే ఈ టాపిక్‌ని కేవలం మైలేజ్‌తో ముగించలేం. ఎందుకంటే ఇక్కడ దేశ ఆర్థిక భద్రత అనే పెద్ద అంశం ఉంది. ఇండియా తనకు అవసరమైన ముడి చమురులో ఎక్కువ భాగాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది.
ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం జరిగినా, రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినా లేదా చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకినా మన దేశంపై ప్రభావం పడుతుంది. అప్పుడు పెట్రోల్ ధరలు కూడా వేగంగా పెరుగుతాయి. కానీ ఇథనాల్ మాత్రం మన దేశంలోనే తయారవుతుంది.
ముఖ్యంగా చెరకు, మొక్కజొన్న లాంటి పంటల నుంచి ఉత్పత్తి అవుతుంది. అంటే రైతులకు అదనపు ఆదాయం వస్తుంది. విదేశీ చమురుపై ఆధారపడటం తగ్గుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం పర్యావరణం. పెట్రోల్ దహనం వల్ల విడుదలయ్యే కార్బన్ ఉద్గారాలతో పోలిస్తే ఇథనాల్ కొంత మేర తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అల్టెర్నెట్ ఇంధనాల కోసం ప్రయత్నిస్తున్నాయి. భవిష్యత్తులో విద్యుత్ వాహనాలు పూర్తిగా ఆధిపత్యం చెలాయించే వరకు ఇథనాల్ ఒక మధ్యంతర పరిష్కారంగా ఉపయోగపడుతుందని చాలామంది నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి E85 గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ప్రస్తుతం డబ్బు ఆదా చేసే మాయా ఇంధనం కాదు.
లీటర్ ధర తక్కువగా కనిపించినా ప్రతి కిలోమీటర్ ఖర్చు పరంగా చూస్తే పెట్రోల్ కంటే ఎప్పుడూ చౌకగా ఉండకపోవచ్చు. కానీ దేశ భవిష్యత్తు ఇంధన భద్రత, రైతుల ఆదాయం, విదేశీ చమురుపై ఆధారాన్ని తగ్గించడం వంటి పెద్ద లక్ష్యాల కోసం ఇది ఒక కీలక అడుగు. రేపు ప్రపంచ చమురు ధరలు భారీగా పెరిగితే ఇదే E85 ఒక్కసారిగా అత్యంత ఆకర్షణీయమైన ఇంధనంగా మారవచ్చు. అందుకే E85 కథ కేవలం పెట్రోల్ బంక్ దగ్గర మొదలై అక్కడే ముగిసిపోదు. ఇది భారత్ ఇంధన భవిష్యత్తును నిర్ణయించే పెద్ద ప్రయోగంలో భాగంగా చెప్పవచ్చు.
తాజావార్తలు
-
EXPLAINER: పెట్రోల్, ఇథనాల్‌లో ఏది వాడితే మీ డబ్బులు సేవ్ అవుతాయి? E100తో బండి తుక్కు అవుతుందా?
-
NEET 2026: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు శుభవార్త!
-
Sanchita Ugale : సంచితా ఉగలే ఆత్మహత్యతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుకు సంబంధం ఉందా?
-
Explained: రెండూ మెసేజింగ్ యాప్‌లే కానీ.. వాట్సాప్‌ను వదిలేసి టెలిగ్రామ్‌నే ఎందుకు బ్యాన్ చేశారు? షాకింగ్ నిజాలు..
-
Deputy CM Pawan Kalyan: గ్రామీణాభివృద్ధే లక్ష్యం.. పంచాయతీరాజ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నాం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?