బ్యాంక్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.. ఫిబ్రవరి 3 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అధికారిక వెబ్‌సైట్ యూనియన్ bankofindia.co.in ద్వారా ఈ పోస్ట్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా ఫిబ్రవరి 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
అప్లికేషన్ ఫీజు..
జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 850 చెల్లించాలి. అలాగే, SC/ST/PWBD అభ్యర్థులు రూ.175 చెల్లించాలి..
ఎంపిక ప్రక్రియ..
అభ్యర్థుల ఎంపికలో ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, అప్లికేషన్ స్క్రీనింగ్ లేదా అర్హత ఉన్న అభ్యర్థుల ఆధారంగా వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉండవచ్చు..
ఎలా అప్లై చేసుకోవాలంటే?
ముందుగా యూనియన్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ unionbankofindia.co.in ను సందర్శించండి. హోమ్‌పేజీలో రిక్రూట్‌మెంట్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి. యూనియన్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ ప్రాజెక్ట్ 2024-25 (స్పెషలిస్ట్ ఆఫీసర్) అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి. రిజిస్టర్ చేసుకోండి.. దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి. దరఖాస్తు రుసుము చెల్లించండి..
ఈ పోస్టులకు సంబందించిన పూర్తి వివరాలను ఈ Union Bank Recruitment 2024 లింక్ లో తెలుసుకోవచ్చు..