Home Work: ఒకటీ రెండు తరగతుల విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వొద్దన్న ఆదేశాలు అమలవుతాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Work: పాఠశాల విద్యార్థుల స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌సీఈఆర్‌టీ) తాజాగా కొన్ని గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. అయితే ఈ మార్గదర్శకాలన్నీ బాగున్నాయని, కానీ వాటి అమలుకు పాఠశాలలు ముందుకు వస్తాయా లేదా అనే సందేహాలు పేరెంట్స్‌లో నెలకొన్నాయి. ఒకటీ రెండు తరగతుల విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వొద్దని ఎస్‌సీఈఆర్‌టీ ఆదేశించింది.
టెక్‌స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ షీట్స్ భారీగా ఉంటాయి కాబట్టి వాటిని బ్యాగులో పెట్టుకొని స్కూల్‌కి తీసుకెళ్లటం, అక్కడి నుంచి ఇంటికి మోసుకెళ్లటం చిన్నారులకు ఇబ్బందనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది. మూడు, నాలుగు, ఐదు తరగతుల వర్క్‌బుక్స్‌ని స్కూల్లో ఉంచటమే దీనికి పరిష్కారమని పరోక్షంగా పేర్కొంది. ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు హోం వర్క్ హెవీగా ఉంటోందని ఎస్‌సీఈఆర్‌టీ అభిప్రాయపడింది.
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
One Man Two Jobs: ఒక వ్యక్తి రెండు ఉద్యోగాలు.. రెండుగా చీలిపోయిన టెక్ కంపెనీలు
స్టూడెంట్స్ హోం వర్క్ విషయంలో ఒత్తిడికి గురికాకూడదంటే వాళ్లకు ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్ట్‌లో మాత్రమే హోం వర్క్ ఇవ్వాలని సూచన చేసింది. ప్రైమరీ క్లాసుల స్టూడెంట్స్‌కి మ్యాథ్స్ సబ్జెక్ట్‌కి ఒక నోట్‌బుక్, మిగతా ఐదు సబ్జెక్టులకు ఒక నోట్ బుక్ పెట్టాలని తెలిపింది. హైస్కూల్ స్టూడెంట్స్ ఒక లాంగ్ నోట్ బుక్‌ని రెండు సబ్జెక్టులకు వాడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని సూచించింది. ఏ రోజు ఏ సబ్జెక్టులను బోధిస్తారో ఆ రోజు ఆ బుక్స్ మాత్రమే తెచ్చుకునేలా చూడాలని ఆదేశాల్లో పొందుపరిచింది.
టెక్‌స్ట్ బుక్స్‌ని సెమిస్టర్ల వారీగానే విద్యార్థులకు పంపిణీ చేయాలని, తదుపరి సెమిస్టర్ వచ్చే వరకు బుక్స్‌ని స్కూల్లోనే భద్రపరచుకునేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. స్టూడెంట్స్ స్కూల్ బ్యాగ్‌ల బరువు ఎంత ఉండాలో తరగతులవారీగా నిర్దేశించింది. 1-2 తరగతులవారికి ఒకటిన్నర కేజీల లోపు, 3-5 తరగతి విద్యార్థులకు 2.5 కేజీలు, 6-7 తరగతులకు 4 కేజీలు, 8-9 తరగతుల వారికి 4.5 కేజీలు, పదో తరగతి విద్యార్థులకు 5 కేజీల లోపు బరువు మాత్రమే ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
ఇదిలాఉండగా ఎస్‌సీఈఆర్‌టీ ఆదేశాలు అమలైతే విద్యార్థులు నిజంగా రిలీఫీ పొందుతారని, అమలు బాధ్యతను ప్రభుత్వం పక్కాగా పర్యవేక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. హోం వర్క్‌లు స్టూడెంట్స్ స్థాయికి మించి ఉండటంతో వాటిని చేయించలేక చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని బలవంతంగా ట్యూషన్లకు పంపించాల్సి వస్తోందనే అభిప్రాయం నెలకొంది. దీనివల్ల పిల్లలు మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురవుతున్నారని, తల్లిదండ్రుల పైన అదనపు ఆర్థిక భారం పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్‌సీఈఆర్‌టీ ఆదేశాలు అమలైతే ఇవన్నీ తొలిగిపోతాయని ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!