బ్యాంక్ ఉద్యోగం చెయ్యాలనుకునే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ అయిన కెనరా బ్యాంకులో పలు శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 500 ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 21 తేదీ ఆఖరి తేదీగా నిర్ణయించారు.. అర్హత, ఆసక్తి కలిగిన వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు..
అర్హతలు :
ఈ బ్యాంక్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ పోస్టులకు అర్హతలు.. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.. అది పూర్తి చేసి మూడేళ్ల లోపు అయ్యి ఉండాలి..
వయస్సు :
అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1, 2023 నాటికి కనిష్టంగా 20 ఏళ్లు.. అదే విధంగా గరిష్టంగా 30 ఏళ్లు మించకూడదని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు… అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు..
వయస్సు సడలింపు:
OBC (NCL) అభ్యర్థులు- 3 సంవత్సరాలు
SC/ST అభ్యర్థులు- 5 సంవత్సరాల
PwBD అభ్యర్థులు- 10 సంవత్సరాలు
దరఖాస్తు ఫీ :
SC/ST/PwD అభ్యర్థులకు- రూ.175
ఇతర అభ్యర్థులకు- రూ.850 చెల్లింపు విధానం – ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి
ఇంటర్వ్యూ ప్రక్రియ :
ప్రిలిమినరీ ఎగ్జామ్
మెయిన్ ఎగ్జామ్
ఇంటర్వ్యూ..
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ: 01/08/2023
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: ఆగస్టు 21, 2023
ఈ ఉద్యోగాలకు ఆసక్తి, అర్హత కలిగిన వాళ్ళు అధికారిక వెబ్ సైట్: https://ibpsonline.ibps.in/crppo13jun23/ లో పూర్తి వివరాల కోసం సందర్శించవచ్చు.. ఇక గతంలో కూడా ఈ బ్యాంక్ పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. వాటికి మంచిది స్పందన రావడంతో ఈ ఏడాది కూడా భారీగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. మీకు ఈ ఉద్యోగాల పై ఆసక్తి ఉంటే మీరు కూడా అప్లై చేసుకోండి..