ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్తుంది.. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలు ఉన్న పలు శాఖల్లోని పోస్టులను భర్తీ చేస్తుంది.. సంక్రాంతికి నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది.. ఈ పండుగ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ, విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామన్నారు..
అలాగే సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పక నెరవేరుస్తాడని మరోసారి గుర్తు చేశారు.. ప్రజాసంకల్ప యాత్రలో ప్రజల సమస్యలను అతి దగ్గరగా చూసి వాటిని వంద శాతం అమలుచేసి దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రికార్డు సృష్టించారన్నారు. వైఎస్సార్ హయాంలో ఏపీ అభివృద్ధి బాటపడితే.. ఇప్పుడు జగన్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసి, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడని అన్నారు..
అదే విధంగా అన్ని జిల్లాల్లోను వివిధ మేనేజ్‌మెంట్లలో ఉన్న ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను అందించాలని మూడునెలల క్రితమే డీఈఓలు, ఆర్జేడీలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీచేసి, వివరాలు సేకరించింది. డైరెక్ట్ నియామకాలకు అనుగుణంగా పోస్టుల రోస్టర్ రిజిస్టర్లతో సహా సమగ్ర సమాచారాన్ని డీఎస్సీ నోటిఫికేషన్ సూచించిన ప్రొఫార్మాలో తీసుకున్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని , ఖాళీల ఆధారంగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఇక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుండటంపై ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్‌కుమార్ ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.. ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రకటనతో నిరుద్యోగులకు ఊరట కలిగించిందని పేర్కొన్నారు.. ఈ ప్రకటన పై డీఎస్సి అభ్యర్థులు కూడా జగన్ సర్కార్ పై హర్షం వ్యక్తం చేస్తున్నారు..