ఎంతో అందమైన అమ్మాయి.. ముద్దుగా మాట్లాడి, తనతో గడుపుతాను అంటే.. ఏ మగాడు మాత్రం ఆగుతాడు. ఇక్కడ మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఆగలేదు. అమ్మాయి అందంగా ఉంది,.. అద్భుతంగా మాట్లాడుతుంది.. అన్నింటికి మించి పడక సుఖం ఇస్తాను అనడంతో సదురు వ్యక్తి ఏమి పట్టించుకోకుండా అమ్మాయిని గుడ్డిగా నమ్మాడు.. ఇక అవన్నీ ఒక పథకం ప్రకారం జరిగినవన్న విషయాన్ని తెలుసుకునే సరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. వచ్చిన అమ్మడు.. ప్రేమతో రాలేదని, పగతో వచ్చిందని తెలిసేసరికి అతగాడు హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ని తలపిస్తున్న ఈ ఘటన అమెరికా లో నెవాడా ప్రాంతంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. 21 ఏళ్ల నికా నికౌబిన్ అనే అమ్మాయి.. ఆన్ లైన్ యాప్ ద్వారా ఒక వ్యక్తిని పరిచయం చేసుకుంది.. ప్రేమ పేరుతో అతనికి దగ్గరయ్యింది. ఇక కొన్నిరోజుల తరువాత ఇద్దరు ఒక చోట కలుసుకొని మాట్లాడుకుందాం అనుకున్నారు. ఇక అమమయి ఓకే అనగానే ఆ వ్యక్తి నెవాడా పరిధిలోని హెండర్సన్ సమీపంలోని సన్సెట్ స్టేషన్ హోటల్ అండ్ క్యాసినో కి దగ్గరగా ఉన్న హోటల్ లో రూమ్ బుక్ చేశాడు. అనుకున్న సమయానికి అమ్మాయిని పికప్ చేసుకొని రూమ్ కి తీసుకెళ్లాడు. ఇక అమాంయితో శృంగారం చేయాలనీ మొదలుపెట్టేలోపు నికా.. తనకు మాములు శృంగారం నచ్చదని, ఫాంటసీ గా శృంగారం చేద్దామని చెప్పడంతో అతడు కూడా సరే అన్నాడు. దీంతో ఆమె అతడిని నగ్నంగా మార్చి కళ్ళకు గంతలు కట్టి శృంగారం మొదలుపెట్టింది. ఇలా శృంగారం మధ్యలో ఉన్నప్పుడు తనతో పాటు తెచ్చుకున్న కత్తి తీసుకొని అతడి గొంతు కోసింది. అనుకోని పరిణామానికి షాక్ అయిన ఆ వ్యక్తి వెంటనే తేరుకొని నికాను పక్కకు నెట్టి బయటికి పరుగులు తీశాడు. ఎలాగోలా ప్రాణాలను దక్కించుకొని ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులకు విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. “రెండేళ్ల క్రితం అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ మిలిటరీ లీడర్ ఖాసీం సులేమానీ మరణానికి ప్రతీకారంగా తానీ పని చేసినట్లుగా” చెప్పిన వైనంతో విచారణ అధికారులు సైతం ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.