Human Sacrifice: కలలో దేవత చెప్పిందని.. షాప్‌కీపర్‌ని నరబలి ఇచ్చిన మహిళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Human Sacrifice: హర్యానాలో దారుణం జరిగింది. దేవత కలలో కనిపించి నరబలి కోరిందని చెబుతూ ఓ మహిళ యువకుడిని హత్య చేసింది. బుధవారం సాయంత్రం ప్రధాన నిందితురాలిగా ఉన్న ప్రియా ఇంట్లో మహేష్ గుప్తా(44) మృతదేహం లభ్యమైంది. బాధితుడు గతంలో మహిళ దుకాణంలో పనిచేసినట్లు తెలిసింది. హత్యకు పాల్పడిన ప్రియాతో పాటు ఆమె సోదరుడు హేమంత్, కోడలు ప్రీతిలను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Annamalai: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై పోలీస్ కేసు.. కారణం ఇదే..
Also Read
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
కచా బజార్ అంబాలా కంటోన్మెంట్కి చెందిన గుప్తా, ఓ షాప్‌కి ఓనర్. ఇతని కాళ్లు, చెవుల వెనక గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితులను విచారిస్తుండగా నరబలి గురించి వెల్లడించినట్లు పోలీసులు చెప్పారు. గత నాలుగైదు రోజులుగా తన కలలో నరబలి కోరుతూ దేవత కనిపిస్తోందని ప్రియా పోలీసులకు చెప్పింది. మృతుడి సోదరుడి ఫిర్యాదు ప్రకారం.. గుప్తా ప్రియాను తన సోదరిగా పరిగణించే వాడని, బుధవారం తన దుకాణం నుంచి కొన్ని వస్తువులను ఆమె నివాసానికి డెలివరీ చేయడానికి వెళ్లాడని పేర్కొన్నాడు.
అయితే, దీని తర్వాత గుప్తా తిరిగిరాకపోవడం, ఫోన్ కాల్కి సమాధానం ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులు అతని కోసం వెతికి పోలీసుకు ఫిర్యాదు చేశారు. ప్రియ ఇంటి సమీపంలో గుప్తా స్కూటర్ గమనించడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ప్రియా ఇంటి తలుపును తట్టిన సమయంలో ఎలాంటి స్పందన రాలేదని గుప్తా సోదరుడు తెలిపారు. బలవంతంగా తలుపు తెరిసిన సమయంలో ప్రియా, ప్రీతి, హేమంత్లు గుప్తా మెడకు స్కార్ఫ్ కట్టి లాగేందుకు ప్రయత్నిస్తుండటం చూశామని ఫిర్యాదిదారు తెలిపారు. గుప్తాను ఆస్పత్రికి తరలించే సమయానికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
-
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
-
Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
ట్రెండింగ్
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!