రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మపేట గ్రామానికి చెందిన మమత అనే మహిళ తన పిల్లలు వరుణ్‌తేజ, అక్షయతో సహా 15 రోజుల క్రితం తల్లిదండ్రులు దగ్గరకు కామారెడ్డి కి వెళ్ళింది. అయితే తిరుగు ప్రయాణంలో వేములవాడ కు చేరుకుంది. వేములవాడ ప్రాంతంలో పిల్లల గొంతు కోసి తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
మమత తోపాటు పిల్లలు వరుణ్ తేజ అక్షయకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే తనతోపాటు పిల్లల గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.