Rajanna Sircilla District: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్‌లో ఉరుములు మెరుపులతో కురిసిన వర్షంతో ఓ ఇంటిపై పిడుగుపాటు చోటుచేసుకుంది. పట్టణంలోని భగవంతు రావునగర్‌లో నివాసముంటున్న చిలుకల దేవయ్య ఇంటిపై అకస్మాత్తుగా పిడుగు పడటంతో ఇంట్లో ఉన్న టెలివిజన్, ఫ్రిజ్, ఫ్యాన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్నాయి. ఇంటి పైభాగంలోని గోడకు పిడుగు తగలడంతో కొంత భాగం కూలిపోయింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Fight at Bus: పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగించే ప్రజలు భద్రంగా ప్రయాణించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అయితే కొంతమంది విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ ఇతరుల ప్రయాణాన్ని నరకంగా మార్చేస్తున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్టీసీ బస్సులో ఓ తాగుబోతు చేసిన వీరంగం, యువతుల ధైర్యంగా ఎదురొడ్డి నిలిచిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. వేములవాడ నుంచి సిద్దిపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఓ వ్యక్తికి యువతులు తగిన గుణపాఠం చెప్పారు.…
Vemulawada : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో అపచారం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు తమ పుట్టిన రోజులతో పాటు క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఉండే యాచకులకు, నిరాశ్రయులకు మాంసాహారంతో కూడిన ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. అయితే ఆలయ పరిసరాల్లోకి మాంసాహారం తీసుకు వెళ్ళొద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన ఆలయం సమీపంలోనికి వెళ్లి మాంసాహారంతో కూడిన ఆహారం పంపిణీ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. విషయం తెలుసుకున్న…
ACB Rides In Vemula Wada Temple: వేములవాడ రాజన్న ఆలయంలో పలు శాఖలలో ఆలయ అధికారుల అవినీతి ఆరోపణ నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు జరిగాయి. తాజాగా అంతర్గత బదిలీలు చేపట్టారు ఆలయ ఈవో వినోద్ రెడ్డి. ఈ నేపథ్యంలో 20 మంది ఆలయ అధికారుల అంతర్గత బదిలీలు జరిగాయి. ప్రధానంగా సరుకుల నిలువలలో వ్యత్యాసం రాగా గోదాం పర్యవేక్షకుడు నరసయ్యను బాధ్యతల నుంచి తప్పించారు. కళ్యాణ కట్ట లోను భక్తుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్న…
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, వేములవాడ ఎమ్మెల్యే ప్రొ.చెన్నమనేని రమేష్‌బాబును రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ వ్యవహారాల సలహాదారుగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నియమించారు. ఆయన ఐదేళ్లపాటు కేబినెట్ హోదాతో ఆ పదవిలో కొనసాగుతారు. Breaking news, latest news, telugu news, big news, cm kcr, chennamaneni ramesh babu, brs, vemulawada news
దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేడారం సమ్మక్క జాతర తెలంగాణకే తలమానికం. అయితే మేడారం సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా మేడారం జాతర సందర్బంగా వేములవాడ రాజన్న దర్శనార్థం విచ్చేసిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా..…
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మపేట గ్రామానికి చెందిన మమత అనే మహిళ తన పిల్లలు వరుణ్‌తేజ, అక్షయతో సహా 15 రోజుల క్రితం తల్లిదండ్రులు దగ్గరకు కామారెడ్డి కి వెళ్ళింది. అయితే తిరుగు ప్రయాణంలో వేములవాడ కు చేరుకుంది. వేములవాడ ప్రాంతంలో పిల్లల గొంతు కోసి తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మమత తోపాటు పిల్లలు వరుణ్ తేజ అక్షయకు తీవ్ర…
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ కార్తీక మాసోత్సవ సందర్భంగా ముస్తాబైంది. కార్తీక మాసం శివుడికి ఎంతో ప్రీతికరమైన నెల కావడంతో ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయాన్ని విద్యుత్‌దీపాలంకరణలతో అంగరంగ వైభవంగా అలంకరించారు. ఆలయంలో నెల రోజుల పాటు స్వామి వారి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామి వారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో…