Extramarital Affair: ఓవైపు ఎఫైర్, మరోవైపు వరకట్న వేధింపులు.. చివరికి ఆ వివాహిత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Commits Suicide Due To Husband Affair And Domestic Harassment: తన భర్త మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం, అత్తారింటి నుంచి వరకట్న వేధింపులు ఎక్కువ అవ్వడంతో.. ఓ వివాహిత మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నిజామాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌కు చెందిన కావ్యశ్రీ(26)కి నవీపేటకు చెందిన ఎర్ర మనోజ్‌తో 2020లో వివాహం జరిగింది. మొదట్లో వీరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది. తన భార్యపై మనోజ్ బాగానే ప్రేమ చూపించేవాడు. అయితే.. కొన్ని రోజులు గడిచిన తర్వాత అతడు కావ్యశ్రీని పట్టించుకోవడం మానేశాడు. తాను ఎంత ప్రేమగా ఉండాలని కావ్యశ్రీ ప్రయత్నించినా.. మనోజ్ అస్సలు పట్టించుకునేవాడే కాదు.
CV Anand: హెర్బల్ ప్రోడక్ట్స్ పేరుతో 7 వేల మందికి టోకరా.. రూ.200 కోట్లు ఢమాల్
Also Read
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Ketan Agarwal Case: కేతన్ పాస్‌పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
తన భర్త ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడని కావ్యశ్రీ ఆరాతీయగా.. అప్పుడు మనోజ్‌కి మరో అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని రివీల్ అయ్యింది. ఈ విషయం తెలిసిన వెంటనే మనోజ్‌ని కావ్యశ్రీ నిలదీయగా.. అతడు సరిగ్గా స్పందించలేదు. దీంతో.. ఈ విషయాన్ని ఆమె పెద్దల దృష్టికి తీసుకువెళ్లింది. పెద్దలందరూ ఇరువురికి సర్దిచెప్పి.. సరిగ్గా కాపురం చేసుకోవాలని సూచించారు. ఆ సమయంలో మనోజ్ ఓకే చెప్పాడు కానీ, మళ్లీ తన ప్రియురాలితో సన్నిహితంగా మెలగడం స్టార్ట్ చేశాడు. ఈ బాధ చాలదన్నట్టు.. కావ్యశ్రీని అదనపు కట్నం తీసుకుని రావాలంటూ మనోజ్ నిత్యం వేధించేవాడు. తనకు అప్పు ఉండటం వల్లే అతడు అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. భర్తతో పాటు అత్తమామలు కూడా కావ్యశ్రీని వేధించసాగారు. దీంతో కావ్యశ్రీ మరింత కుంగిపోయింది. భర్త ఎఫైర్, అత్తారింటి వరకట్న వేధింపులు భరించలేక.. బుధవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని, ఆత్మహత్యకు పాల్పడింది.
Jawan: మెంటలెక్కిస్తున్న జవాన్ క్రేజ్.. ట్రైలర్ రిలీజ్ కాకుండానే అన్ని కోట్లా?
తమ కూతురు ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలిసి.. కావ్యశ్రీ తల్లిదండ్రులు బోరున విలపించారు. తన కూతురును అదనపు కట్నం కోసం వేధించడంతోనే, ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి రాజేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. భర్త మనోజ్, అత్తమామలైన అరుణ, మహేష్‌పై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Homemade Face Mask: 50 ఏళ్ల వయస్సులోనూ 30 ఏళ్ల మెరుపు.. ఇంట్లోనే తయారయ్యే సహజ ఫేస్ మాస్క్ ఇదే!
-
India vs England: “బుడ్డోడా నీ ప్రతిభకు సలాం”.. కానీ నీకోసం కాటేరమ్మకొడుకును బలి చేయలేం..!
-
Pradeep Kumar IAS: పదవీ విరమణ రోజే సీబీఐ షాక్.. ఐఏఎస్ ప్రదీప్ కుమార్ అరెస్టు.. కారణం ఇదే!
-
Jr NTR : ఎన్టీఆర్ అన్‌స్టాపబుల్ లైనప్.. మూడు భారీ ప్రాజెక్టులపైనే ఫుల్ ఫోకస్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!