చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. మద్యంమత్తులో విచక్షణ మరిచి కన్నకూతురిపైనే అత్యాచారం చేశాడు ఓ దుర్మార్గపు తండ్రి. భర్త ఘాతుకాన్ని ఆపడానికి ఏ భార్య చేయని పనిని ఆమె చేసింది. కూతురిని కాపాడుకోవడం కోసం ఆ తల్లి, భర్తను హతమార్చింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఒంటేరిలోని వజీమా నగర్ లో ప్రదీప్ (44), ప్రీతి (41) భార్యాభర్తలు. వీరికి ఒక కూతురు(20), ఒక కొడుకు. కొన్నేళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో ఇటీవల కలతలు చెలరేగాయి. ప్రదీప్ పనిపాట చెయ్యకుండా సుఖంగా ఉండటానికి అలవాటు పడ్డాడు. దీంతో ఇంట్లో కుటుంబ భారాన్ని మొత్తం ప్రీతిపై పడింది.
ఇక నిత్యం ప్రదీప్ మద్యం తాగి వచ్చి భార్యాపిల్లలను కొట్టడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే గతరాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన ప్రదీప్.. కూతురు అనే విచక్షణ మరిచి ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. దీంతో ఆ యువతి గట్టిగా కేకలు వేయడంతో పక్క గదిలో ఉన్న ప్రీతీ ఆ ఘాతుకాన్ని చూసి నిర్ఘాంతపోయింది. వెంటనే కూతురును కాపాడాలనే తాపత్రయంతో ఇంట్లో ఉన్న సుత్తి తీసుకుని ఆమె భర్తను చంపేసి కూతుర్ని రక్షించుకుంది. వెంటనే ఈ విషయాన్ని స్థానికులు తెలుపగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ప్రీతిని అరెస్ట్ చేశారు.